Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Raja Riyaz Ahmad Khan Says Imran Khan Should Have Been Hanged Publicly

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ను పబ్లిక్‌లో ఉరితీయాలి.. ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు

Published Date :May 16, 2023 , 1:24 pm
By NTV WebDesk
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ను పబ్లిక్‌లో ఉరితీయాలి.. ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Raja Riyaz Ahmad Khan Says Imran Khan Should Have Been Hanged Publicly: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను పబ్లిక్‌లో ఉరి తీయాలని ప్రతిపక్ష నేత రాజా రియాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. జడ్జీలు ఆయన్ను అల్లుడిలా ట్రీట్ చేస్తున్నారంటూ, బెయిల్ మంజూరు చేసిన వారిపై ధ్వజమెత్తారు. ఈ యూదుల ఏజెంట్‌ జడ్జీలకు అంతగా నచ్చితే.. వాళ్లందరూ వెళ్లి పీటీఐ పార్టీలో చేరాలని సెటైర్లు వేశారు. పీటీఐ పార్టీలో ఆ జడ్జీల కోసం కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని, వారు ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని పేర్కొన్నారు. ఆ జడ్జీల స్థానంలో పేదలకు న్యాయం చేసే న్యాయమూర్తుల్ని తీసుకురావాలని కోరారు. పార్లమెంట్ సాక్షిగా రియాజ్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు ఇమ్రాన్ శిక్షణ ఇచ్చారని, ఆయనొక యూధుల ఏజెంట్ అని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆ ఉగ్రవాదులే పాక్ పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారని, కమాండర్ జిన్నా ఇంటిని కూడా తగలబెట్టారని రియాజ్ అహ్మద్ మండిపడ్డారు. అలాగే.. పీటీఐ మద్దతుదారులు పాకిస్థాన్‌లో సృష్టిస్తున్న విధ్వంసం వల్ల దేశం సిగ్గుపడుతోందన్నారు.

Anasuya Bharadwaj: ఏంటి ఆంటీ కుర్రాళ్లను ఇంతలా రెచ్చగొడుతున్నావ్‌..

ఇదిలావుండగా.. ఆల్ ఖరీద్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అవ్వడం, బెయిల్‌పై విడుదల అవ్వడం తెలిసిందే! అలాగే.. తోషాఖానా కేసులోనూ క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కూడా ఇస్లామాబాద్ హైకోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడంపై ఆయన మద్దతుదారులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఆస్తులతో పాటు భవనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు మరణించారు. కొందరిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన ఇమ్రాన్ ఖాన్.. ప్రజలందరూ శాంతియుతంగా నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే.. పీటీఐ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసకు పాల్పడింది ఎవరో నిర్ధారించుకోకుండా.. పీటీఐ శ్రేణలపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపణలు చేశారు.

Wrestlers Protest: తాకితే అపార్థం చేసుకుంటారా.. రుజువులున్నాయా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Imran Khan
  • pakistan crisis
  • Pakistan Political Issues
  • pti party
  • Raja Riyaz Ahmad Khan

తాజావార్తలు

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Pakistan: పాక్‌లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..

  • Sara Arjun: ‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్!

  • Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions