Site icon NTV Telugu

Rahul Gandhi: కొంతమందికే విద్యా హక్కు.. వాక్ స్వాతంత్ర్యం లేదు.. రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahulgandhi

Rahulgandhi

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విదేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కొంత మందికే విద్యా హక్కు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత కులాల ప్రయోజనాలకే ప్రభుత్వ సేవ చేస్తోందని.. మధ్యతరగతి, దిగువ కులాలు, గిరిజన వర్గాల చరిత్ర, సంప్రదాయాలు, సహకారాలను విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా దేశంలో వాక్ స్వాతంత్ర్యంపై కూడా దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Israel: రెండేళ్ల తర్వాత విషాదకర నిర్ణయం.. హమాస్ చేతిలో ప్రియురాలి చనిపోయిందని ప్రియుడు ఆత్మహత్య

పెరూలోని పోంటిఫికల్ కాథలిక్ విశ్వవిద్యాలయం, చిలీ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. భారతదేశంలో విద్యా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గొప్ప వైవిధ్యాన్ని ప్రతిబింబించే విద్యా వ్యవస్థ దేశానికి అవసరం అని పేర్కొన్నారు. కొంత మందికే విద్య ప్రత్యేక హక్కుగా మారకూడదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Suresh Gopi: కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తా.. తిరిగి సినిమాలు చేసుకుంటా.. సురేష్ గోపి సంచలన ప్రకటన

ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ విద్య వెనక్కి తగ్గి ప్రైవేటు సంస్థలు ఆధిపత్యం చెలాయించడానికి అనుమతించారని ఆరోపించారు. ప్రైవేటు సంస్థలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం అందరికీ అధిక నాణ్యత కూడిన విద్యను అందించాలని కోరారు. విద్య కోసం ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రాహుల్ గాంధీ దక్షిణ అమెరికాకు వెళ్లి చాలా రోజులైంది. దాదాపు 15 రోజులైంది. సెప్టెంబర్ 26న దక్షిణ అమెరికాకు వెళ్లారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ అక్కడే పర్యటిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ రహస్య పర్యటన ఎందుకు అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. పర్యటన యొక్క అసలు ఉద్దేశం ఏంటి? అని నిలదీశారు.

Exit mobile version