లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విదేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కొంత మందికే విద్యా హక్కు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత కులాల ప్రయోజనాలకే ప్రభుత్వ సేవ చేస్తోందని.. మధ్యతరగతి, దిగువ కులాలు, గిరిజన వర్గాల చరిత్ర, సంప్రదాయాలు, సహకారాలను విస్మరిస్తుందని ధ్వజమెత్తారు.