Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చివరకు నిరాశే ఎదురైంది. ట్రంప్‌ను కాదని వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు కొరినో మచాడోను ‘‘నోబెల్ శాంతి బహుమతి 2025’’ వరించింది. ఆమెకు నోబెల్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.
Read Also: Bihar Elections: బీజేపీలో భోజ్‌పురి స్టార్.. ప్రతిపక్ష పార్టీలో భార్య జ్యోతి సింగ్..
అమెరికా అధ్యక్షుడు శాంతి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారని పుతిన్ అన్నారు. ట్రంప్ శాంతి కోసం చాలా చేస్తారని ఆయన అన్నారు. శుక్రవారం పుతిన్ మాట్లాడుతూ.. ‘‘శాంతిని ప్రోత్సహించడానికి ట్రంప్ గొప్పగా చేస్తున్నారు’’ అని ప్రశంసించారు. ఇటీవల, ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణను పుతిన్ ఉదాహరణగా చూపారు. అయితే, ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడా కాదా అని నిర్ణయించడం తన హక్కు కాదని ఆయన అన్నారు. గాజాలో శాంతిని పునరుద్ధరణపై ట్రంప్‌ను అభినందించారు. ఇది విజయవంతం అయితే నిజంగా చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తుందని అన్నారు.
అయితే, ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై వైట్ హౌజ్ స్పందించింది. నోబెల్ కమిటీ శాంతి కన్నా రాజకీయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించింది. ట్రంప్‌కు నోబెల్ వచ్చినా, రాకున్నా ఆయన శాంతి కోసం ముందుకు వెళ్తారని చెప్పుకొచ్చింది.
