రెండు దశాబ్దాల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్-అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మధ్య జరిగిన ‘పాకిస్థాన్ అణ్వాయుధ’ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య జరిగిన ట్రాన్స్‌క్రిప్ట్‌లను నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ విడుదల చేసింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ అణ్వాయుధాలపై ఇరువురి నేతలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేసినట్లుగా పత్రాల్లో వెల్లడయ్యాయి.
ఇది కూడా చదవండి: Canada: కెనడాలో మరో ఘోరం.. టొరంటో వర్సిటీలో భారతీయ విద్యార్థి హత్య
జూన్ 16, 2001లో స్లోవేనియాలో జార్జ్ డబ్ల్యూ బుష్-పుతిన్ మధ్య వ్యక్తిగత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ అణ్వాయుధాలపై పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2001-2008 మధ్య పలుమార్లు సమావేశాలు, ఫోన్ కాల్ సంభాషణలు జరిగాయి. ఆ సందర్భంగా పాకిస్థాన్ సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని ఒక ముఖ్యమైన నాన్-ప్రొలిఫెరేషన్‌పై ఆందోళన వ్యక్తం చేసినట్లుగా పత్రాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Thailand: కంబోడియాలో విష్ణువు విగ్రహాన్ని అందుకే కూల్చాం.. థాయ్‌లాండ్ వివరణ
అణ్వాయుధంపై పుతిన్ భయాందోళన వ్యక్తం చేసినట్లుగానే జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా భయాందోళన వ్యక్తం చేసినట్లుగా ట్రాన్స్‌క్రిప్ట్‌లు పేర్కొన్నాయి. ఇక పుతిన్ నమ్మదగినవాడిగా బుష్ అభివర్ణించినట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్ అణ్వాయుధ కార్యక్రమానికి రూపశిల్పి అయిన అబ్దుల్ ఖదీర్ ఖాన్‌పై సెప్టెంబర్ 29, 2005న ఓవల్ ఆఫీస్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఇరానియన్ సెంట్రిఫ్యూజ్‌ల్లో పాకిస్థాన్‌కు చెందిన యురేనియం కొనబడిందని బుష్‌తో పుతిన్ సంభాషించారు. దీనిని బట్టి ఇస్లామాబాద్ అణు నెట్‌వర్క్ ఇతర దేశాలకు విస్తరిస్తున్నట్లుగా పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే బుష్ స్పందిస్తూ.. ఈ అన్వేషణ ఆందోళనకరమని అంగీకరించారు. ఇది ఉల్లంఘనగా అభివర్ణించారు. ఈ సంభాషణ బట్టి పాకిస్థాన్ అణ్వాయుధ శక్తి అమెరికాను కూడా భయపెట్టినట్లుగా అర్థమవుతోంది.

ఇక అబ్దుల్ ఖదీర్ ఖాన్ వ్యవహారంలో ఇస్లామాబాద్‌పై వాషింగ్టన్ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌తో తాను మాట్లాడతానని పుతిన్‌కు బుష్ భరోసా ఇచ్చారు. అబ్దుల్ ఖదీర్ ఖాన్‌ను అతని సహచరులను చాలా మందిని జైల్లో పెట్టారని.. గృహ నిర్బంధంలో ఉంచారని బుష్ అన్నారు. అయితే అణ్వాయుధ శక్తిని ఎవరెవరితో పంచుకుందో.. ఎవరికి బదిలీ చేయబడిందో అమెరికా కూడా తెలుసుకోవాలని అనుకుంటోందని బుష్ అన్నారు.
ఇక 9/11 ఉగ్రవాదంపై యుద్ధం తర్వాత పాకిస్థాన్ అధికారికంగా అమెరికాకు కీలక మిత్రదేశంగా మారింది. అయినప్పటికీ వాషింగ్టన్-మాస్కో రెండూ కూడా అణు నిర్వహణను తీవ్ర అనుమానంతో చూశాయని ట్రాన్స్‌క్రిప్ట్‌లు వెల్లడించాయి. అయితే 2000లో అబ్దుల్ ఖదీర్ ఖాన్ నెట్‌వర్క్ ఇరాన్, ఉత్తర కొరియా, లిబియా వరకు విస్తరించినట్లుగా ట్రాన్స్‌క్రిప్ట్‌ల్లోని సంభాషణను బట్టి అర్థమవుతోంది.