Putin: ఇరాన్‌కు విశ్వసనీయ మిత్రులం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం
- ఇరాన్‌కు విశ్వసనీయ మిత్రులం
- నమ్మకమైన భాగస్వామిగా ఉంటాం
- రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌కు రష్యా విశ్వసనీయ మిత్రుడు అని అధ్యక్షుడు పుతిన్ సందేశం ఇచ్చారు. నౌరుజ్ (Nowruz) పెర్షియన్ నూతన సంవత్సరం పండుగ సందర్భంగా ఇరాన్ నాయకులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. మాస్కో-టెహ్రాన్ మంచి మిత్రులు అని..నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని శనివారం పుతిన్ కీలక సందేశం పంపించారు.
ఇది కూడా చదవండి: Iran-US: బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్.. షాకైన అమెరికా!
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
దేశ సర్వోన్నత నాయకుడు అయతుల్లా మోజ్తాబా ఖమేనీకి, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌కు పుతిన్ శుభాకాంక్షలు పంపారని క్రెమ్లిన్ తెలిపింది. ‘‘ఇరాన్ ప్రజలు కఠినమైన పరీక్షలను గౌరవప్రదంగా అధిగమించాలని పుతిన్ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో మాస్కో టెహ్రాన్‌కు నమ్మకమైన మిత్రుడుగా, విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుంది.’’ అని క్రెమ్లిన్ తెలిపింది.
ఇక రష్యాకు సంబంధించిన నిఘా సమాచారాన్ని వాషింగ్టన్ ఉక్రెయిన్‌కు అందించడం మానేస్తే.. ఇరాన్‌తో నిఘా సమాచారాన్ని పంచుకోవడం క్రెమ్లిన్ ఆపేస్తుందని మాస్కో వాషింగ్టన్‌కు ఒక ప్రతిపాదన చేసిందని.. అయితే అమెరికా ఆ ఆలోచనను తిరస్కరించిందని పొలిటికో నివేదించింది. క్రెమ్లిన్ మాత్రంఈ నివేదికను నకిలీదిగా కొట్టిపారేసింది.
వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను అమెరికా కూలదోయడంతో రష్యా ఒక మిత్రదేశాన్ని కోల్పోయింది. ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల పెరిగిన చమురు ధరల నుంచి మాస్కో మాత్రం ప్రయోజనం పొందింది. అయితే ఇరాన్ అణు బాంబును అభివృద్ధి చేయడాన్ని తాము కోరుకోవడం లేదని రష్యా పదేపదే చెబుతోంది. అయితే ఈ చర్య మధ్యప్రాచ్యం అంతటా అణ్వాయుధ పోటీకి దారితీస్తుందని మాస్కో భయపడుతోంది.
ఇది కూడా చదవండి: Madhumita: ప్రముఖ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దీంతో ప్రతీకారంగా ఇరాన్.. గల్ఫ్ దేశాలపై దాడి చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభం తలెత్తింది.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో కొత్త రకం దొంగతనాలు.. షాకైన ప్రజలు
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!