NTV Telugu Site icon

Volodymyr Zelenskyy: ఆ విషయంలో భారత్ భాగస్వామ్యం ఆశిస్తున్నా

Modi Zelenskyy Phone

Modi Zelenskyy Phone

PM Narendra Modi Held Talks With Ukraine President Volodymyr Zelenskyy: కొన్ని రోజుల క్రితమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా.. తాము శాంతి ప్రయత్నాల్లో ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామని భరోసా కల్పించారు. బాధిత ప్రజలకు మానవతాసాయం ఇచ్చేందుకూ కట్టుబడి ఉన్నామన్నారు. వెంటనే యుద్ధాన్ని విరమించేందుకు ఇరు దేశాలు (రష్యా, ఉక్రెయిన్) చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇరువర్గాలు చర్చలు ప్రారంభించి.. విభేదాల్ని పరిష్కరించుకొని.. దీర్ఘకాలిక పరిష్కారాలకు బాటలు వేయాలని సూచించారు. అలాగే.. ఉక్రెయిన్‌లో చదువుకుంటూ భారత్‌కి తిరిగొచ్చిన విద్యార్థుల విద్యాభ్యాసం కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జెలెన్‌స్కీని మోడీ కోరారు. ఈమేరకు అధికార ప్రకటన విడుదలైంది.

President Schedule Today: తెలంగాణాలో రాష్ట్రపతి పర్యటన.. నేటి షెడ్యూల్‌ ఇదే..

అటు.. మోడీతో జరిగిన సంభాషణ గురించి ట్విటర్ మాధ్యమంగా జెలెన్‌స్కీ వెల్లడించారు. తాను మోడీతో ఫోన్‌లో మాట్లాడానని, జీ20 ప్రెసిడెన్సీ విజయవంతంగా సాగాలని తాను ఆకాంక్షిస్తున్నానని అన్నారు. గతంలో తాను ఇదే ప్లాట్‌ఫామ్‌ (జీ20 వేదికగా)లో శాంతి సూత్రాన్ని ప్రతిపాదించానని, దాని అమలుకు భారత్ మద్దతు ఇస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు. ఈ విషయంలో తనకు భారత్ భాగస్వామ్యంపై నమ్మకం ఉందన్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ తమకు మద్దతు తెలిపినందుకు, సంక్షోభ సమయంలో మానవతా సాయం అందించినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధనేరాలకు బాధ్యులైనవారిని శిక్షించడం, ఉక్రెయిన్‌ నుంచి రష్యా బలగాలన్ని ఉపసంహరించడం, తమ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడం వంటి 10 అంశాల శాంతి ప్రణాళికను తాను వివరించినట్లు పేర్కొన్నారు. అలాగే.. ఆహార, ఇంధన, అణు భద్రతకు భరోసాను కోరుతున్నట్లు కోరారు.

Anuraj Thakur: ఇంకా 1962లోనే ఉన్నారంటూ.. రాహుల్‌పై అనురాగ్ కౌంటర్

కాగా.. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24వ తేదీ నుంచి రష్యా దురాక్రమణను ప్రారంభించినప్పటి నుంచి ఆ రెండు దేశాల అధ్యక్షులతో ప్రధాని మోడీ పలుమార్లు ఫోన్‌లో సంభాషించారు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకొని, యుద్ధానికి స్వస్తి పలకాలని ఇరుదేశాల అధినేతల్ని సూచిస్తూ వస్తున్నారు. ఓవైపు జెలెన్‌స్కీ చర్చల ద్వారా ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు మొగ్గు చూపుతుంటే.. రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై విజయం సాధించాలనే పట్టు వీడట్లేదు. ఆ దేశంపై విజయం సాధించాకే ఈ యుద్ధం ఆగుతుందని, లేదంటే ప్రపంచమే వినాశనమవుతుందని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది.

Tsrtc Discount: టీఎస్ ఆర్టీసీ బంప‌రాఫ‌ర్.. ఇలా చేస్తే టికెట్లపై భారీ డిస్కౌంట్..

Show comments