G7 Summit: జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ-మార్క్ కార్నీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ-మార్క్ కార్నీ భేటీ
- ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ కెనడాలో పర్యటిస్తున్నారు. జీ 7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం కెనడా చేరుకున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ 7 సమ్మిట్‌కు హాజరయ్యారు. వాస్తవానికి జీ 7లో భారత్ భాగస్వామ్యం కాకపోయినా.. 2019 నుంచి మోడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతున్నారు. అయితే గతేడాది జస్టిన్ ట్రూడో ప్రభుత్వ హయాంలో కెనడాతో భారత్ సంబంధాలు క్షీణించాయి. తిరిగి ఇన్ని రోజులకు మార్క్ కార్నీ రాకతో తిరిగి సంబంధాలు పునరుద్ధరించబడుతున్నాయి.

Also Read
జీ 7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ- కెనడా ప్రధాని మార్క్ కార్నీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సమావేశంతో తిరిగి ఇరు దేశాల మధ్య సంబంధాలు పున:ప్రారంభమైనట్లుగా సంకేతాలు ఇచ్చారు. భారత్-కెనడా సంబంధాలు చాలా ముఖ్యమైనవిగా ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాలు ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడదామని.. కలిసి ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేద్దామని మోడీ కోరారు. రెండు దేశాలు కలిసి పని చేస్తే.. వనరులన్నింటినీ సముచితంగా ఉపయోగించుకుంటే మానవాళి సంక్షేమం కోసం పని చేయగలమని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: PEDDI : ‘పెద్ది’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ .. ఇండియన్ సినిమాకు న్యూ బెంచ్‌మార్క్?
మార్క్ కార్నీ మాట్లాడుతూ. జీ 7లో మోడీకి ఆతిథ్యం ఇవ్వడం గొప్ప గౌరవమని అభిప్రాయపడ్డారు. 2018 నుంచి భారతదేశం జీ7లో పాల్గొంటోందని.. ఇది దేశం యొక్క ప్రాముఖ్యతకు.. నాయకత్వానికి నిదర్శనం అన్నారు. కలిసి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇదొక వేదిక అన్నారు. ఐఏ భవిష్యత్, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. ఇతర అంశాలకు వ్యతిరేకంగా కలిసి పోరాటం చేద్దామని కార్నీ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: ENG vs IND: బుమ్రా ఆడొద్దని ఇంగ్లండ్ టీమ్ కోరుకుంటోంది.. బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Had an excellent meeting with Prime Minister Mark Carney. Complimented him and the Canadian Government for successfully hosting the G7 Summit. India and Canada are connected by a strong belief in democracy, freedom and rule of law. PM Carney and I look forward to working closely… pic.twitter.com/QyadmnThwH
— Narendra Modi (@narendramodi) June 17, 2025

తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!