Site icon NTV Telugu

PM Modi: కెనడా చేరుకున్న మోడీ.. జీ7 సదస్సుకు హాజరు

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ కెనడా చేరుకున్నారు. కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘనస్వాగతం లభించింది. ఈరోజు, రేపు కెనడాలో పర్యటించనున్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు తెగిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు మోడీ కెనడాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. దీంతో ప్రపంచమంతా సర్వత్రా ఆసక్తిగా చూస్తోంది. ఇక ప్రధాని మోడీ 2019 నుంచి జీ7 సమావేశాలకు హాజరవుతూ వస్తున్నారు.

ఇది కూడా చదవండి: Seven Hills Express: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తు్న్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో మంటలు

కెనడాలోని ఆల్బెర్టాలోని కననాస్కిస్ గ్రామంలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ అధికారిక ఆహ్వానం మేరకు 2015 తర్వాత ప్రధాని మోడీ కెనడాలో పర్యటిస్తున్న తొలి పర్యటన ఇది.

ఇది కూడా చదవండి: Puri Jagannadh : పూరి-సేతుపతి మూవీలో మరో హీరోయిన్..!

జీ 7 సదస్సు సోమవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్, యూరోపియన్ యూనియన్‌తో సహా ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లోనే కొందరు నాయకులంతా ఒకచోట చేరనున్నారు. ప్రధానంగా ఈ సమ్మిట్‌లో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. వాస్తవానికి భారత దేశం జీ7లో సభ్యత్వం లేదు. అయినా కూడా 2019 నుంచి మోడీకి ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రస్తుతం కెనడా ఆహ్వానం మేరకు వెళ్లారు. ఇక ఇటీవల భారతదేశం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో తొలిసారి మోడీ అంతర్జాతీయ పర్యటన చేపట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఈ అంశాన్ని ప్రధాని మోడీ లేవనెత్తే అవకాశం ఉంది.

జీ7 సమ్మిట్ అజెండా
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం. అలాగే ట్రంప్ విధించిన సుంకాలు. భౌగోళికంగా చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Exit mobile version