ప్రధాని మోడీ జపాన్ చేరుకున్నారు. టోక్యో చేరుకోగానే ఎయిర్‌పోర్టులో మోడీకి ఘనస్వాగతం లభించింది. జపాన్, చైనా పర్యటన కోసం మోడీ గురువారం బయల్దేరి వెళ్లారు. శుక్ర, శనివారం పర్యటనలో భాగంగా 15వ భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు మోడీ జపాన్‌కు వెళ్లారు. 2014 నుంచి ఇప్పటి వరకు మోడీ ఎనిమిది సార్లు జపాన్‌లో పర్యటించారు. మోడీ చివరిసారిగా 2018లో ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. తిరిగి ఏడేళ్ల తర్వాత మరోసారి జపాన్‌లో పర్యటిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Off The Record : ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన ఆరోపణల వెనుక రహస్యమేంటి?
క్వాడ్, ఏఐ, సెమీ-కండక్టర్లు.. మొదలగు అంశాలపై జపాన్‌తో మోడీ చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ప్రాంతీయ, ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇక జపాన్‌కు చెందిన అనేక మంది రాజకీయ నాయకులతో పాటు జపాన్‌లోని భారత స్నేహితులతో కూడా చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సంబంధాలను మరింతగా పెంచే లక్ష్యంతో జపాన్, భారత పరిశ్రమల నాయకులతో జరిగే వ్యాపార నాయకుల ఫోరమ్‌లో కూడా మోడీ పాల్గొననున్నారు.
ఇక ఆగస్టు 30న మోడీ-ఇషిబా మియాగి ప్రిఫెక్చర్‌కు వెళ్లనున్నారు. అక్కడ సెండాయ్‌లోని తోహోకు షింకన్సెన్ ప్లాంట్‌ను పరిశీలించనున్నట్లు జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ‘బుల్లెట్ ట్రైన్’ ప్రాజెక్ట్ కోసం 2030లో ఇండియాకు తరలించనున్న E-10 కోచ్‌లను పరిశీలించనున్నారు. అనంతరం ఒక ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక భద్రత, సెమీకండక్టర్ టెక్నాలజీ సహకారం, కృత్రిమ మేధస్సుతో సహా అనేక పత్రాలపై ఇరుపక్షాలు సంకాలు చేయనున్నారు. అలాగే అంతరిక్ష, రక్షణ సహకారాలపై కూడా ఇరువురు చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Mohammed Shami: టీమిండియాలో చోటుపై ఎలాంటి ఆశలూ లేవు.. షమీ ఆసక్తికర వ్యాఖ్యలు!
జపాన్ పర్యటన ముగింపుకుని ఆగస్టు 31న మోడీ చైనాకు చేరుకుంటారు. టియాంజిన్‌లో జరిగే ఎస్సీవో సమ్మిట్‌లో పాల్గొననున్నారు. శిఖరాగ్ర సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో మోడీ సమావేశం కానున్నారు. సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్తున్నారు. చైనాలో జరిగే సమ్మిట్‌కు 11 దేశాల నేతలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఇక ఇందులో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఉన్నారు. ఈ సమ్మిట్‌కు ఎస్సీవో దేశాలతో పాటు నేపాల్, మాల్దీవులు, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, మంగోలియా, తుర్క్మెనిస్తాన్, లావోస్, అర్మేనియా, అజర్బైజాన్ నాయకులంతా సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. చైనాలో టూర్లో భాగంగా తొలిసారి జిన్‌పింగ్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Tokyo, Japan. He is on a two-day visit to Japan at the invitation of Japanese PM Shigeru Ishiba to participate in the 15th India-Japan Annual Summit.
(Source: DD News) pic.twitter.com/GF1JvX9mJf
— ANI (@ANI) August 29, 2025
#WATCH | Delhi | Prime Minister Narendra Modi emplanes for Tokyo, Japan. He is on a two-day visit to Japan at the invitation of Japanese PM Shigeru Ishiba to participate in the 15th India-Japan Annual Summit, marking PM Modi’s eighth visit to the country.
(Source: DD/ANI) pic.twitter.com/A9MUhk41UE
— ANI (@ANI) August 28, 2025
Prime Minister Narendra Modi tweets, "Landed in Tokyo. As India and Japan continue to strengthen their developmental cooperation, I look forward to engaging with PM Ishiba and others during this visit, thus providing an opportunity to deepen existing partnerships and explore new… pic.twitter.com/QBiXdClhh6
— ANI (@ANI) August 29, 2025
#WATCH | Japan | Prime Minister Narendra Modi witnesses a cultural performance as he arrives at a hotel in Tokyo.
(Source: DD News) pic.twitter.com/0neV3QEp8q
— ANI (@ANI) August 29, 2025
#WATCH | Japan | Prime Minister Narendra Modi greets and interacts with the members of the Indian diaspora as he arrives at a hotel in Tokyo.
(Source: DD News) pic.twitter.com/Kfmk5esMLX
— ANI (@ANI) August 29, 2025