విచిత్ర ఒప్పందం: వ్యాక్సిన్ అందిస్తే… ఆ దేశం నర్సులను ఇస్తుందట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచదేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు, సేవలు చేసేందుకు కావాల్సిన వైద్యులు, నర్సుల కొరత ప్రపంచదేశాల్లో అధికంగా ఉన్నది. అయితే, ఏ దేశానికీ ఆ దేశం ఇప్పుడు ఈ కొరత లేకుండా చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడి ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి అధికంగా ఉన్నది. దీంతో వివిధ దేశాల నుంచి నర్సులను రిక్రూట్ చేసుకోవడానికి ఆయా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఫిలిప్పీన్స్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమకు వ్యాక్సిన్ అందిస్తే దానికి బదులుగా ఆయా దేశాలకు నర్సులను అందిస్తామని ప్రకటించింది. ఆసియాలోని అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనా, ఫిలిప్పీన్స్ లో మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టలేదు. చైనా 148 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను అందించేందుకు ముందుకు వచ్చింది. మరి ఫిలిప్పీన్స్ ఆఫర్ ను ప్రపంచదేశాలు వినియోగించుకుంటాయా చూడాలి. అయితే, ఫిలిప్పీన్స్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి నర్సులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేందుకు తమకు ఆసక్తిగా ఉందని, కానీ, ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం ఇలా తమను బలిచేయడం తగదని అంటున్నారు.
Also Read
- POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
తాజావార్తలు
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!