Pakistan: మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత..!
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మిలిటరీ రూలర్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ మీడియా పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్లు వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. 78 ఏళ్ల వయసులో తీవ్ర ఆరోగ్య సమస్యలతో, ఆరోగ్యం క్షీణించడంతో దుబాయ్ లోని ఓ అమెరికన్ ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ముషారఫ్ ను చూసేందుకు ఆయన బంధువులు పాక్ నుంచి దుబాయ్ వెళ్లారు.
1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. నవాజ్ షరీఫ్ ప్రజాప్రభుత్వాన్ని కూల్చి ముషారఫ్ అధికారంలోకి వచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత ముషారఫ్ దుబాయ్ లోనే ఉంటున్నారు. ఆయనపై పాకిస్తాన్ లో పలు అవినీతి, దేశ ద్రోహ కేసులు నమోదు అయ్యాయి. సైన్యంలో పనిచేసిన ముషారఫ్ 1965,1971 ఇండొో- పాక్ యుద్దాల్లో పాల్గొన్నాడు. 1999 కార్గిల్ వార్ ముషరఫ్ ఆర్మీ చీఫ్ గా ఉన్న సమయంలోనే చోటు చేసుకుంది. ఆ తరువాతే ప్రధాని నవాజ్ షరీఫ్ ను గద్దె దింపి, అధ్యక్షుడిగా అధికారం చేజిక్కించుకున్నారు. 2007లో పాకిస్తాన్ లో ఎమర్జెన్సీని ముషారఫ్ విధించారు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేశారు. దీనిపై ఇప్పటిికీ పాకిస్తాన్ లో ముషారఫ్ పై కేసులు ఉన్నాయి. ముషారఫ్ పై నాలుగు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినా బతికి బయటపడ్డాడు. 2008 నుంచి దుబాయ్ లో ప్రవాసంలో ఉన్నారు.
Also Read
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్‌లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్‌బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
తాజావార్తలు
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!