Video viral: గ్రాండ్‌గా పాక్ మహిళ విడాకుల పార్టీ.. వీడియో వైరల్
- గ్రాండ్‌గా పాక్ మహిళ విడాకుల పార్టీ
- సోషల్ మీడియాలో పోస్టు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమ్మీద భార్యాభర్తల బాంధవ్యానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎక్కడెక్కడో పుట్టిన ఒక అబ్బాయి-ఒక అమ్మాయి.. మూడు ముళ్ల బంధం చేత ఒక్కటవుతారు. అలా ఒక్కటైన జంట.. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలిసి సంతోషంగా ఉండాలని పెద్దలంతా ఆశీర్వదిస్తారు. ఇదంతా ఒకెత్తు అయితే ఇక జీవితంలో గ్రాండ్‌గా జరుపుకునేది ఏదైనా ఉందంటే అది వివాహమే. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిన అంగరంగ వైభవంగా ప్రపంచ మంతా చెప్పుకునేలా చేశారు. ఆ పెళ్లిలో నీతా అంబానీ వివాహం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినప్పుడు అతిథుల కళ్లు చెమర్చాయి. ఇంత గొప్పదైన వైవాహిక బంధం.. కొందరి జీవితాల్లో మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. ఇదంతా ఇప్పుడెందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.
ఆ మహిళ వైవాహిక జీవితంలో ఏం ఒడుదుడుకులు వచ్చాయో.. ఏమో తెలియదు గానీ.. తన విడాకులను.. పెళ్లి కంటే గ్రాండ్‌గా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
- Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
అమెరికాలో ఉంటున్న పాకిస్థాన్ మహిళ.. తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ సందర్భాన్ని ఆమె చాలా వేడుకగా నిర్వహించింది. అతిథుల్ని పిలిచి గ్రాండ్‌గా చేసింది. స్టేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో ‘డివోర్స్ ముబారక్’ అంటూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి.. దానికి ముందు బాలీవుడ్ పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. అక్కడికి వచ్చిన అతిథులు కూడా ఆమెను చాలా ఎంకరేజ్ చేశారు. నోట్లు వెదజల్లుతూ ఉత్సాహపరిచారు. వీడియోలో శ్రోతలు కూడా కేరింతలు కొడుతూ గంతులేశారు. అయితే ఆమె విడాకులు ఎందుకు తీసుకుందో చెప్పలేదు గానీ.. ఈ వీడియోపై పాకిస్థాన్ నెటిజన్లు.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇంకొందరు నెటిజన్లు ఆమెకు సపోర్టుగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
https://twitter.com/ProfesorSahab/status/1816487590700429748
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!