ప్రముఖ పాకిస్తాన్ టెలివిజన్ హెస్ట్, పాక్ జాతీయ అసెంబ్లీ మాజీ సభ్యుడు అమీర్ లియాఖత్ (49) కరాచీలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పాక్ మీడియా గురువారం తెలిపింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ( పీటీఐ) పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. గతంలో పలు కీలక స్థానాల్లో పనిచేశారు. కరాచీలోని ఖుదాద్ కాలనీలోని అతని ఇంటిలో అపస్మారక స్థితిలో అమీర్ లియాఖత్ హుస్సెన్ కనిపించారు.. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అయితే బుధవారం రాత్రి నుంచే ఆయన అసౌకర్యానికి గురయ్యారని.. కాగా ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రం నిరాకరించారని పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక మీడియా జియో న్యూస్ వెల్లడిాంచింది. ఇదిలా ఉంటే గురువారం ఉదయం లియాఖత్ గది నుంచి అరుపులు వినిపించాయని లియాఖత్ ఉద్యోగి జావేద్ తెలిపాడు. గది లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో సిబ్బంది సహాయంలో తలుపును పగలగొట్టారు. ఆస్పత్రికి తరలించే లోపే లియాఖత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అమీర్ మరణంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అతని ఇంటిలో సోదాలు నిర్వహించారు. మరణానికి దారి తీసిన పరిస్థితుల గురించి పోలీసులు విచారిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. పోస్ట్ మార్టం కోసం నిర్వహించాని పోలీసులు నిర్ణయించారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కారణాలు వెల్లడికానున్నాయి. ఈ ఘటనలపై సమాచారం అందించిన అమీర్ డ్రైవర్ జావేద్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు.
అమీర్ లియాఖత్ హుస్సెన్ మీమ్స్ ఇండియాలో కూడా చాలా ఫేమస్. దాదాపుగా ప్రతీ సోషల్ మీడియాలో ఈయన మీమ్స్ తరుచుగా కనిపిస్తుంటాయి. అంతలా ప్రేక్షకులను అలరించారు అమీర్. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలో చేరకముందు ఆయన జనరల్ పర్వేజ్ ముషారఫ్ సైనిక ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగా పనిచేశారు. ఆయన మరణంపై ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.