NTV Telugu Site icon

Pakistan Crisis: పాక్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. మంత్రులు, ఉద్యోగాల్లో కోత

Pakistan Crisis

Pakistan Crisis

Pakistan To Cut Govt Employees Salaries And Ministers Allowance: ప్రస్తుతం పాకిస్తాన్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాక్‌లో కేవలం మూడంటే మూడు వారాలకు మాత్రమే సరిపడా మాదకద్రవ్యం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఖర్చులు తగ్గించుకునేందుకు షెహబాజ్‌ షరీఫ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే షరీఫ్ ఇప్పటికే జాతీయ పొదుపు కమిటీ (National Austerity Committee)ని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ కమిటీ కొన్ని పరిశీలనలు చేసి.. ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్టు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది.

Boyfriend Crime: మరో వ్యక్తితో పెళ్లి.. గొంతు కోసిన ప్రియుడు

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించడంతో పాటు మంత్రిత్వ శాఖలు, వాటి సంబంధిత విభాగాల ఖర్చుకు 15 శాతం కోత పెట్టాలని.. ఆ కమిటీ ప్రధాని షరీఫ్‌కి ప్రతిపాదించినట్టు ఆ మీడియా సంస్థ పేర్కొంది. అంతేకాదు.. మంత్రుల సంఖ్యను 78 నుంచి 30కి తగ్గించాలని, సలహాదారుల సంఖ్యను సైతం కుదించాలని ఆ కమిటీ పరిశీలిస్తోంది. ఆపై మిగిలిన వారు స్వచ్ఛందంగా పని చేయాల్సి ఉంటుందని ఆ కమిటీ తన ప్రతిపాదనలో తెలిజేసినట్టు ఆ వార్తా కథనం పేర్కొంటోంది. ఇప్పుడున్న ఆర్థిక సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే.. ఈ కోత, వేటు మార్గాలనే అత్యుత్తమమని ఆ కమిటీ ప్రతిపాదించినట్టు సమాచారం. మరి.. పాక్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Akkineni Nagarjuna: ఏమయ్యా నాగార్జున.. తండ్రి వివాదం కన్నా పెళ్లి వేడుక ముఖ్యమా..?

మరోవైపు.. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) సహాయం కోసం పాక్ ఎదురుచూస్తోంది. కానీ.. ఆ సంస్థ పెట్టే నిబంధనల్ని పాటించేందుకు మాత్రం పాక్ విముఖత వ్యక్తం చేస్తుంది. గత రెండున్నర నెలల నుంచి ఐఎంఎఫ్, పాక్ మధ్య ఈ పరిస్థితి కొనసాగుతుంది. అటు.. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు గాను పాక్ ఇప్పటికే కొన్ని పొదుపు చర్యల్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా కరెంటు కోతలు విధిస్తుండటంతో పాటు ప్రభుత్వ అధికారుల పనివేళలను కుదించింది. రాత్రివేళల్లో వేడుకలపై నిషేధం విధించి. మాల్స్‌, ఫ్యాక్టరీలు కూడా త్వరగా మూసివేయాలని ఆదేశించింది. పాలకుల అవినీతి, కరోనా, ప్రకృతి విపత్తులే ఆ దేశాన్ని గట్టిగా దెబ్బతీశాయి.