Site icon NTV Telugu

Trump: బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్‌లో పాక్ ప్రధానికి అవమానం.. ట్రంప్ ఏం చేశారంటే..!

Trump2 (1)

Trump2 (1)

ట్రంప్ నేతృత్వంలో గురువారం వాషింగ్టన్‌లో గాజా పునర్‌నిర్మాణంపై బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి భారత్‌తో పాటు దాయాది దేశం పాకిస్థాన్ సహా పలు దేశాధినేతలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌‌కు తీవ్ర అవమానం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: US-UK: ఇరాన్‌పై దాడికి ప్రణాళిక.. బ్రిటన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. కారణమిదే!

గురువారం వాషింగ్టన్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్‌ మీటింగ్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. మళ్లీ భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మళ్లీ రిపీట్ చేశారు. కోట్లాది మంది ప్రాణాలను కాపాడినట్లుగా చెప్పుకొచ్చారు. వాణిజ్య బెదిరింపులతో ఇరు దేశాలను హెచ్చరించానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ ప్రధానిని ఇది నిజమా? కాదా? అని అడిగారు.. నిలబడి చెప్పాలన్నారు. పాపం చేసేదేమీలేక ప్రపంచ నేతల ముందు తల వంచి షెహబాజ్ షరీఫ్ అసౌకర్యంగా నిలబడ్డారు. స్కూల్‌లో స్టూడెంట్‌ తప్పు చేస్తే టీచర్ నిలబెట్టినట్లుగా నిలబడమనడంతో షెహబాజ్ షరీఫ్‌కు తీవ్ర అసంతృప్తిగా అనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Trump-Obama: ఒబామా చాలా తప్పు చేశారు.. ఆ వార్త లీక్ చేయడంపై ట్రంప్ అభ్యంతరం

 

Exit mobile version