Shahbaz Sharif: “నేను, ఆసిమ్ మునీర్ విదేశాలకు వెళ్లి అడుక్కునే వాళ్లం”.. ఒప్పుకున్న పాక్ ప్రధాని..
- నేను, అసిమ్ మునీర్ విదేశాలకు వెళ్లి అడుక్కునే వాళ్లం..
- అప్పు తీసుకునే వాడు తలవంచుకోవాల్సిందే..
- అప్పు కోసం అనేక షరతులు అంగీకరించాల్సి వస్తోంది..
- ఎట్టకేలకు ఒప్పుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahbaz Sharif: పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఐఎంఎఫ్, చైనా, అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి అప్పులు కోరుతోంది. అప్పుల కోసం తాము ఎలా విదేశాలకు తిరుగుతున్నామనే విషయాన్ని సాక్షాత్తు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించిన వీడియో వైరల్‌గా మారింది. తాము విదేశాల్లో భిక్షాటన చేస్తున్నామనే విషయాన్ని పాక్ ప్రధాని అంగీకరించారు.
Read Also: Epstein files: రష్యన్ అమ్మాయితో సె*క్స్, బిల్ గేట్స్‌కు STD.. ఎస్‌స్టీన్ ఫైల్స్ సంచలనం..
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
తాను, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కలిసి ఇతర దేశాలకు వెళ్లి ఎలా అడుక్కుంటున్నామనే విషయాన్ని షరీఫ్ బహిరంగంగా చెప్పారు. ఈ వీడియోలో ఐఎంఎఫ్ ప్యాకేజీ గురించి ఎలాంటి షరతులకు అంగీకరించాల్సి వచ్చిందో వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని షహబాజ్ షరీప్ తన దుస్థిని ప్రజలకు వివరించారు. ‘‘మాకు సహాయం చేసిన దేశాలకు నేను థాంక్స్ చెబుతున్నా. కానీ అప్పు తీసుకోవడం అనేది బాధ్యతతో కూడిన విషయం. నేను మీకు ఎలా వివరించాలో తెలియదు. నేను, అసిమ్ మునీర్ కలిసి సైలెంట్‌గా ఇతర దేశాలకు వెళ్లి, పాక్ పరిస్థితి, ఐఎంఎఫ్ రుణాల గురించి వివరించి, బిలియన్ డాలర్ల అపపు కోరాల్సి వచ్చింది. అప్పు అడిగే వ్యక్తి తల ఎప్పుడూ వంగే ఉంటుంది’’ అని అన్నారు.
అప్పులు తీసుకున్న తర్వాత కొన్ని షరతులకు అంగీకరించాల్సిందే అని షరీఫ్ అన్నారు.‘‘ఒకసారి అప్పు తీసుకుంటే, ఆ దేశాల నుంచి కొన్ని డిమాండ్లు రావడం సహజం. గౌరవాన్ని కాపాడుకుంటూ అప్పు తీసుకోవడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో వారి షరతులు అంగీకరించాల్సిందే’’ అని అన్నారు. కష్టకాలంలో పాకిస్తాన్‌కు చైనా చాలా సాయం చేసిందని, అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ కూడా సహకరించాయని చెప్పారు.
शाहबाज शरीफ खुलकर स्वीकार कर रहे हैं कि
– पाकिस्तान इंटरनेशनल भिखारी है
– मैं और आसिम मुनीर भीख मांगने जाते हैं दुनिया
– हमें शर्म आती है भीख मांगते हुए
– हमें सर झुकाकर रखना पड़ता है pic.twitter.com/n6AjjjfJGI— Abhay Pratap Singh (बहुत सरल हूं) (@IAbhay_Pratap) January 31, 2026
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!