Shahbaz Sharif: పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఐఎంఎఫ్, చైనా, అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి అప్పులు కోరుతోంది. అప్పుల కోసం తాము ఎలా విదేశాలకు తిరుగుతున్నామనే విషయాన్ని సాక్షాత్తు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించిన వీడియో వైరల్‌గా మారింది. తాము విదేశాల్లో భిక్షాటన చేస్తున్నామనే విషయాన్ని పాక్ ప్రధాని అంగీకరించారు.