Pakistan: పాకిస్తాన్ రాజధాని లాక్ డౌన్.. ముఖ్య నగరాల్లో ఇంటర్నెట్ బంద్.. కారణం ఇదే..
- పాక్ రాజధాని ఇస్లామాబాద్ ‘‘లాక్ డౌన్’’..
- ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ర్యాలీపై ఆంక్షలు..
- పలు నగరాల్లో ఇంటర్నెట్ బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా ఆయన విడుదలను కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉండటంతో అక్కడి ప్రభుత్వ కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రాజధాని ఇస్లామాబాద్‌లోకి రాకుండా4 నిరోధించేందుకు పాకిస్తాన్ అధికారులు శుక్రవారం ముఖ్యమైన చర్యలు చేపట్టారు. ఇస్లామాబాద్‌కి రాకుండా అన్ని మార్గాలను మూసేశారు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు.
Read Also: Big Breaking: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోయిస్టుల హతం..
Also Read
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్‌లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన ప్రకటన..
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
ఇస్లామాబాద్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను అడ్డుకునేందుకు ఏకంగా షిప్పింగ్ కంటైనర్లను ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు, పారామిలిటరీ భద్రత ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభల్ని అడ్డుకునేలా ప్లాన్ చేశారు. ఎవరైనా ఇస్లామాబాద్‌పై దాడి చేయాలని ప్లాన్ చేస్తే దానిని జరగనివ్వబోమని ఆ దేశ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ అన్నారు. అక్టోబర్ 15-16 తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశానికి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్‌తో సహా ఇతర దేశాల ఉన్నత నాయకులు వస్తుండటంతో ర్యాలీని వాయిదా వేయాలని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల్ని కోరారు. ఇదిలా ఉంటే, ఇస్లామాబాద్, రావాల్పిండి, కరాచీ వంటి నగరాలతో పాటు పాకిస్తాన్‌లోని కొన్ని పట్టణాల్లో ఇంటర్నెట్‌ని బంద్ చేశారు.
అవిశ్వాస తీర్మానం ద్వారా 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయాడు. తాను దిగిపోవడానికి పాక్ సైన్యమే కారణం అంటూ, అమెరికా కుట్ర పన్నినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే, అవినీతి, దేశద్రోహం వంటి ఆరోపణకు సంబంధించి 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2023 నుంచి జైలులో ఉన్నారు.
తాజావార్తలు
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ ..
-
Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
-
Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!