Site icon NTV Telugu

Pakistan-US: అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసే యోచనలో పాక్!

Pakistanus1

Pakistanus1

అమెరికాతో పాకిస్థాన్ సంబంధాలు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వైట్‌హౌస్‌లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు మంచి ఆతిథ్యం లభించింది. ఇద్దరూ గొప్ప నాయకులు అంటూ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. ఇక భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ప్రపంచ నాయకుడు ట్రంప్ అంటూ షెహబాజ్ షరీఫ్ కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఇక నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను అసిమ్ మునీర్ నామినేట్ చేశాడు. ఇక పాకిస్థాన్‌పై తక్కువ సుంకం విధించి.. భారత్‌పై మాత్రం ట్రంప్ భారీగా సుంకం విధించారు. దీంతో అమెరికాతో పాకిస్థాన్ సంబంధాలు బలపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Trump-Mark Carney: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్‌పై కెనడా ప్రధాని ప్రశంసలు

ఇక తాజాగా అమెరికాలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాలను కొనుగోలు చేయాలని పాకిస్థాన్ భావిస్తున్నట్లు పాకిస్థాన్‌కు చెందిన ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ మంగళవారం ఒక కథనంలో పేర్కొంది. అమెరికా నుంచి అధునాతన ఎయిర్ టు ఎయిర్ AIM-120 క్షిపణులను కొనుగోలు చేసే అవకాశం ఉందని కథనంలో తెలిపింది.

ఇది కూడా చదవండి: Diwali: దీపావళి రోజున సెలవుగా ప్రకటిస్తూ కాలిఫోర్నియా గవర్నర్‌ ఉత్తర్వు

గతంలో రక్షణ శాఖగా ఉన్న యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ (DoW) ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌లో AIM-120 క్షిపణులను అందుకున్న దేశాల జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపింది. దీంతో అమెరికా నుంచి AIM-120 అడ్వాన్స్‌డ్ మీడియం-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను (AMRAAM) పొందే అవకాశం ఉందని సమాచారం. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను స్పష్టంగా తెలియజేస్తోందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ స్పష్టం చేసింది.

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ ఒప్పందం ప్రకారం.. పాకిస్థాన్, యూకే, పోలాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, సౌదీ అరేబియా, టర్కీ ఉన్నాయి. ఈ ఆర్డర్‌కు సంబంధించిన పని మే 2030 చివరి నాటికి పూర్తి అవుతుంది. ‘‘ఈ ఒప్పందంలో యూకే, పోలాండ్, పాకిస్థాన్, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, రొమేనియా, ఖతార్, ఒమన్, కొరియా, గ్రీస్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, సింగపూర్, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్, జపాన్, స్లోవేకియా, డెన్మార్క్, కెనడా, బెల్జియం, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇటలీ, నార్వే, స్పెయిన్, కువైట్, ఫిన్లాండ్, స్వీడన్, తైవాన్, లిథువేనియా, ఇజ్రాయెల్, బల్గేరియా, హంగేరీ, టర్కీలకు విదేశీ సైనిక అమ్మకాలు ఉంటాయి’’ అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇటీవల సౌదీ అరేబియాతో పాకిస్థాన్ రక్షణ ఒప్పందం చేసుకుంది. ఈ రక్షణ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి చేస్తే రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించి.. శత్రువుపై రెండు దేశాలు పోరాటం చేయాలని ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే భారత్ ప్రకటించింది. తాజాగా అమెరికా దగ్గర నుంచి పాకిస్థాన్ అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version