Pakistan Lawyers Thrash Man Who Tortured, Assaulted Girl Student: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో ఇటీవల ఓ వైద్య విద్యార్థినిపై క్రూరంగా ప్రవర్థించి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చర్చనీయాంశం అయింది. తోటి స్నేహితురాలే.. తన తండ్రిని పెళ్లి చేసుకోవాలని కోరగా.. దీనికి నిరాకరించిన యువతిని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. అయితే మెడికల్ విద్యార్థినిపై హింస, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని గురువారం పోలీసులు ఫైసలాబాద్ కోర్టుకు తీసుకువచ్చారు పోలీసులు. ఈ సమయంలోనే కోర్టు ఆవరణలో ఉన్న న్యాయవాదులు అతన్ని చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేశారు. చివరకు నిందితుడిపై బూట్లను విసిరారు. కోర్టు ప్రస్తుతం నిందితుడిని విచారణ కోసం రెండు రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది.
Read Also: lumpy Skin Disease: లంపీ స్కిన్ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలి.. సీఎం అశోక్ గెహ్లాట్ డిమాండ్
ఖతీజా మహమూద్ అనే డెంటల్ విద్యార్థిపై ఫైసలాబాద్ లో ఆగస్టు 8న దాడి జరిగింది. పారిశ్రామికవేత్త అయిన డానిష్ తనను పెళ్లి చేసుకోవాలని ఖతీజా ముందు ప్రతిపాదన పెట్టాడు. అయితే ఆమె దీన్ని తిరస్కరించింది. దీంతో గత మంగళవారం యువతిని నిందితులు కొట్టడంతో పాటు, ఆమె తల, కనుబొమ్మలను షేవింగ్ చేశారు.. దీంతో పాటు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అమ్మాయిని అపహరించి, దోపిడి, లైంగిక వేధింపులకు పాల్పడిన 15 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు పాక్ పోలీసులు. ప్రధాని నిందితుడు డానిష్ తో పాటు అతని కుమార్తెతో సహా ఏడుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు.
డానిష్ కూతురు అన్నా, బాధిత యువతి ఖతీజాలు ఇద్దర క్లాస్ మెట్స్. అన్నా తండ్రి డానిష్ నాకు పెళ్లి ప్రపోజ్ చేశాడని.. మా నాన్న వయస్సున్న ఆయన ప్రతిపాదనను తిరస్కరించానని.. ఖతీజా చెప్పారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఖతీజాతో పాటు ఆమె సోదరుడిని డానిష్ ఇంటికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. ఖతీజా గుండు గీయడంతో పాటు ప్రధాన నిందితుడు డానిష్ ఆమెను వేరే గదికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పాకిస్థాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఫర్ ఖతీజా యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
https://twitter.com/etribune/status/1559878195700277248