Pakistan: “మీ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారు.. అప్పగించండి”.. ఇమ్రాన్ ఖాన్‌కు పోలీసుల అల్టిమేటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి అస్సలు బాగా లేదు. అక్కడ ప్రభుత్వం, సైన్యం, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా ఆ దేశం బతికీడుస్తోంది. ఇది చాలదన్నట్లు ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం పాక్ ను మరింత కల్లోలానికి గురిచేస్తోంది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరువాత దేశ వ్యాప్తంగా ఆయన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ విడుదలైనా.. కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు.
Read Also: Bihar: ముస్లిం యువతితో బైక్‌పై వెళ్లడమే పాపమైంది.. హిందూ యువకుడిపై దాడి..
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
మరోవైపు న్యాయవ్యవస్థ ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా వ్యవహరిస్తోందని పీఎం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అటా బండియాల్, ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో సైన్యం తలదూర్చడం మంచిది కాదని పాక్ ఆర్మీకి ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ పరిణామాలు పాకిస్తాన్ ను అంతర్యుద్ధం వైపు తీసుకెళ్లేలా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే లాహోర్ లోని ఇమ్రాన్ ఖాన్ నివాసం జమాన్ పార్క్ లో 30-40 మంది ఉగ్రవాదులు ఉన్నారని పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని అప్పగించడానికి పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)కి 24 గంటల డెడ్ లైన్ విధించారు పోలీసులు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జమాన్ పార్క్ నివాసంలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని పంజాబ్ ఆపద్ధర్మ ప్రభుత్వం ఆరోపించింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ పై 100కు పైగా కేసులు ఉన్నాయి, ఏ కేసులో కూడా ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయకుండా మే 31 వరకు పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!