Smoking Violation: విమానంలో సిగరెట్ తాగుతూ పట్టుబడ్డ పాకిస్తాన్ హాకీ జట్టు మేనేజర్.. దింపేసిన సిబ్బంది..
- FIH ప్రో లీగ్ టోర్నమెంట్‌కు సీనియర్ పాకిస్తాన్ హాకీ జట్టుకు మేనేజర్ గా వెళ్లిన అంజుమ్ సయీద్
- 1992 ఒలింపిక్స్ సెమీఫైనల్లో ఆడిన అనుభవజ్ఞుడైన ఆటగాడు
- 1994 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టులో డిఫెండర్, మిడ్‌ఫీల్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIH ప్రో లీగ్ టోర్నమెంట్‌కు సీనియర్ పాకిస్తాన్ హాకీ జట్టుతో పాటు మేనేజర్‌గా అర్జెంటీనాకు వెళ్లిన ప్రముఖ మాజీ ఒలింపియన్ అంజుమ్ సయీద్ బ్రెజిల్లో వివాదంలో చిక్కుకున్నారు. అర్జెంటీనా నుంచి పాకిస్తాన్‌కు తిరిగి వస్తున్న క్రమంలో విమానం రియో డి జనీరో విమానాశ్రయంలో ఇంధనం నింపేందుకు ఆగిన సమయంలో, విమానంలోనే ధూమపానం చేసినందుకు ఆయనను విమాన సిబ్బంది దింపేశారు.
భద్రతా నిబంధనల ఉల్లంఘనగా భావించిన విమాన సిబ్బంది అంజుమ్ సయీద్‌తో పాటు మరో పాకిస్తాన్ ఆటగాడిని దుబాయ్‌కు వెళ్లే తదుపరి విమానంలో ఎక్కేందుకు అనుమతించలేదు. దీంతో వారు బ్రెజిల్‌లోనే ఆగిపోవాల్సి వచ్చింది. 1992 ఒలింపిక్స్ సెమీఫైనల్లో పాల్గొన్న అనుభవజ్ఞుడైన అంజుమ్ సయీద్, 1994 ప్రపంచకప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టులో డిఫెండర్, మిడ్‌ఫీల్డర్‌గా కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తిని ఈసారి జట్టు మేనేజర్‌గా నియమించడం గమనార్హం.
Also Read
- ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
- US Iran War: జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా దాడులు..
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
- Russia-Telegram: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఉగ్రవాద ఆరోపణలు.. రష్యా సంచలన నిర్ణయం
అయితే ఈ ఘటన అనంతరం ఆయన స్వదేశానికి చేరుకుని, జట్టుతో కలిసి రాలేకపోవడానికి దుబాయ్‌లోని కొంతమంది సిబ్బంది ప్రవర్తనే కారణమని ఆరోపించారు. ఈ సంఘటన పాకిస్తాన్ క్రీడా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని భావించిన పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు అధికారులు స్పందించి, ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (PHF)ను కోరారు.
విమానం ఇంధనం నింపుతున్న సమయంలో ధూమపానం అంశంపై ప్రశ్నించగా అంజుమ్ సయీద్‌తో పాటు మరో ఆటగాడు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ జట్టు తమ తొలి FIH ప్రో లీగ్ ప్రదర్శనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఇలాంటి వివాదాలు తలెత్తడం పాకిస్తాన్ హాకీపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Priyanka Gandhi: గోమూత్ర వ్యాఖ్యలపై అభ్యంతరం.. ప్రియాంకాగాంధీకి విద్యావేత్తల లేఖ
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
-
Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
-
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!