Pakistan: విదేశీ మహిళలపై పాక్ ఉప ప్రధాని మనవడి గ్యాంగ్ రేప్.
- విదేశీ మహిళలపై పాకిస్తాన్లో అత్యాచారం..
- నిందితుల్లో ఒకరు పాక్ ఉప ప్రధాని మనవడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇద్దరు విదేశీ మహిళల్ని నమ్మించి, పాకిస్తాన్ వచ్చిన తర్వాత కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మనవడు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడితో సహా నలుగురు అనుమానితుల్ని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన నిందితులను మహమ్మద్ రజా దార్, హసన్ రజా, సికందర్ ఖాన్, మరియు సాజిద్ అలీగా గుర్తించారు. లాహోర్ కోర్టు శుక్రవారం నలుగురు నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది.
ప్రధాన నిందితుడు మహమ్మద్ రజా దార్, ఇతను పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ బంధువుని, వరసకు మనవడు అవుతాడని సమాచారం. ఉప ప్రధానితో ఈ కేసు ముడిపడి ఉండటంతో పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాల్లలో ఒకరు నెదర్లాండ్స్, మరొకరు వెనిజులాకు చెందినవారు. జూన్ 29న లాహోర్‌లో వీరిద్దరినీ అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
బాధితుల్లో ఒకరి తండ్రి స్పెయిన్ నుంచి పోలీసులకు ఫోన్ చేసి తన కుమార్తెకు ప్రమాదం గురించి తెలియజేయడంతో జూన్ 29న లాహోర్‌లో వీరిద్దరినీ అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు స్పందించి ఇద్దరు మహిళలను సురక్షితంగా రక్షించారు. లాహోర్ పోలీసులు గురువారం ఐదుగురు నిందితులపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులలో నలుగురిని అరెస్టు చేయగా, ఐదవ వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇతని కోసం దాడులు చేస్తున్నారు.
ఇద్దరు మహిళలు అక్టోబర్ 2025లో సింగపూర్‌లో ముహమ్మద్ రజా దార్‌ను కలిశారు. వీరిద్దరిని పాకిస్తాన్ రమ్మని ఆహ్వానించారు. ఇద్దరు మహిళల్ని క్రిప్టో కరెన్సీ వ్యాపారం కోసమని నమ్మంచి పాకిస్తాన్ రప్పించారు. రజా దార్ ఇద్దర మహిళలకు బిజినెస్ వీసాలు ఏర్పాటు చేశాడు. జూన్ 29న ఇద్దర కూడా లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, అక్కడి నుంచి కిడ్నాప్ చేసి, ఒక గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విడుదల చేయడానికి నిందితులు డబ్బుల్ని డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. కోర్టు విచారణ సమయంలో రజా దార్‌ను ప్రధాన నిందితుడిగా ఇద్దరు మహిళలు గుర్తించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!