Pakistan: భారత్ దెబ్బ అదుర్స్.. పాకిస్తాన్లో తీవ్ర నీటి సంక్షోభం..
- పాకిస్తాన్లో తీవ్ర నీటి సంక్షోభం..
- వ్యవసాయానికి కటకట..
- సింధు జలాల ఒప్పందం రద్దుతో పెరిగిన ఇబ్బందులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌కి కొత్త సంక్షోభం వచ్చి పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటు, ఉగ్రవాదంతో సతమతం అవుతున్న ఆ దేశాన్ని ఇప్పుడు ‘‘నీటి సంక్షోభం’’ భయపెడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. దీని ప్రభావం ప్రస్తుతం పాకిస్తాన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నది వ్యవస్థలో నీటి కొరత కనిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఖరీఫ్(వానాకాలం పంటల) విత్తే కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో నీటి సమస్య తీవ్రమైంది.
పాకిస్తాన్ లోని రెండు ముఖ్యమైన ఆనకట్టలు సింధు నదిపై ఉన్న తర్బెలా, జీల్ నదిపై ఉన్న మంగ్లాలో నీరు తగ్గపోతున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన వేడి వాతావరణం నీటి కొరతకు ఒక కారణం కాగా, ఇక చీనాబ్ నది నీటిని భారత్ సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాకిస్తాన్ కష్టాలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, జూన్ 02, 2025 నాటికి సింధు నదీ వ్యవస్థలో (పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపల) నీటి లభ్యత 2024 జూన్ 02తో పోలిస్తే 10.3 శాతం తగ్గింది. నైరుతి రుతుపవనాలు ప్రారంభానికి ఇంకా కనీసం నాలుగు వారాల సమయం ఉన్నందున రాబోయే వారాల్లో ఈ పరిస్థితి మరింత దిగజారవచ్చని తెలుస్తోంది.
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
సింధు నదీ వ్యవస్థ అథారిటీ (IRSA) ప్రకారం, జూన్ 2, 2025 నాటికి పంజాబ్ ప్రావిన్స్‌లో మొత్తం నీటి లభ్యత కేవలం 1,28,800 క్యూసెక్కులు, ఇది గత సంవత్సరం అదే నెలలో అందుబాటులో ఉన్న నీటి కంటే 14,800 క్యూసెక్కులు తక్కువ. ఖరీఫ్ విత్తే కాలం ప్రారంభమైనందున, నైరుతి రుతుపవనాలు జూన్ చివరి నాటికి పంజాబ్ ప్రావిన్స్ చేరుకునే అవకాశం లేకపోవడంతో నీటి కొరత ఆ దేశ రైతులకు పెద్ద విపత్తగా మారొచ్చు.
Read Also: Mount Etna: భారీగా పేలిన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు..!
గత నెలలో పాకిస్తాన్ ఈ వేసవిలో 21 శాతం నీటి కొరత ఉంటుందని అంచనా వేసింది. దీంతో నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని అక్కడి అధికారులు సూచించారు. పాకిస్తాన్ పంజాబ్, సింధ్ ప్రావిన్సులకు కీలకమైన రెండు ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష నిల్వలో 50 శాతం నీటి కొరత ఉంటుందని ఇస్లామాబాద్ కూడా అంచనా వేసింది. గత వారం తజకిస్తాన్ పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సింధు జలాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. భారత ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ‘‘నీరు, రక్తం కలిసి ప్రవహించదు’’ అని స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ఆపితేనే నీటిని విడుదల చేస్తామని చెప్పకనే చెప్పారు. 1960 నాటి సింధు జలాల ఒప్పందంపై భారత్‌దే తుది నిర్ణయం కాబట్టి పాకిస్తాన్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది.
ఈ ఒప్పందం పశ్చిమ నదులను (సింధు, జీలం, చీనాబ్) పాకిస్తాన్‌కు మరియు తూర్పు నదులను (రవి, బియాస్, సట్లెజ్) భారతదేశానికి కేటాయిస్తుంది. అదే సమయంలో ఇరు దేశాలు నీటి మట్టాలు, ప్రాజెక్టుల వివరాలు ఇచ్చిపుచ్చుకోవాలి. అయితే, ప్రస్తుతం భారత్ ఒప్పందం నిలిపేయడంతో పాకిస్తాన్‌తో ఎలాంటి డేటా పంచుకోవడం లేదు. భారత్ నీటి మట్టాల గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోతే, పాకిస్తాన్‌కి కరువు, వరద పరిస్థితులపై అవగాహన ఉండదు. ఫలితంగా వర్షాకాలంలో వరదలు సంభవిస్తే పాక్ తీవ్రంగా నష్టపోవడం ఖాయం.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!