Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతలు
- ఇరాన్ కొత్త ప్లాన్
- యూరప్ దేశాల్లో కలవరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చితే యూరప్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులపై దాడులు చేసే అవకాశాలను ఇరాన్ పరిశీలిస్తున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న వర్గాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించాయి.
ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు, అలాగే కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు జరుగుతున్న చర్చలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తదుపరి వ్యూహాలపై ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Also Read
- Piyush Goyal: ‘కాలుష్యానికి కారణం మీరే.. భారత్‌పై నిందలేంటి?’.. యూరప్ కపటత్వాన్ని ముఖం మీదే బట్టబయలు..
- India vs Pakistan at UN: ‘పాకిస్థాన్ మాకు నీతులు చెప్పొద్దు’.. ఐరాసలో మైనారిటీల హక్కులపై భారత్ ఘాటు వ్యాఖ్యలు
- Trump: ఇరాన్‌ను చిత్తుగా ఓడించాం.. ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు
- Tibet Earthquake: 7 తీవ్రతతో టిబెట్‌లో భూకంపం.. 16 మంది మృతి, 32 మందికి గాయాలు
సైప్రస్‌లో బ్రిటన్ స్థావరం టార్గెట్?
మీడియా నివేదిక ప్రకారం.. ఇరాన్ పరిశీలిస్తున్న లక్ష్యాల్లో సైప్రస్‌లోని బ్రిటన్ వైమానిక స్థావరం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చిలో ఈ స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. దక్షిణ-తూర్పు యూరప్‌లోని మరికొన్ని ప్రాంతాలను కూడా ఇరాన్ పరిశీలించినట్లు సమాచారం. ముఖ్యంగా బల్గేరియాలోని బెజ్మెర్ వైమానిక స్థావరానికి అమెరికా సైన్యానికి ఇంధన నింపే సదుపాయాన్ని కల్పించేందుకు గత నెలలో అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ఈ స్థావరం కూడా ఇరాన్ లక్ష్యాల జాబితాలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
సముద్రగర్భ కేబుల్స్‌పైనా దాడి?
యుద్ధం మరింత విస్తరించిన పక్షంలో హార్ముజ్ జలసంధిలోని సముద్రగర్భ ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్‌పై దాడి చేసే అవకాశాన్ని కూడా ఇరాన్ సైనిక దళాలు పరిశీలించినట్లు ఓ వర్గం వెల్లడించినట్లు తెలిపింది. అమెరికా మరోసారి భారీ స్థాయిలో దాడులకు దిగితే.. ఇరాన్ సైనిక కమాండర్లు ఇప్పటివరకు అనుసరించిన వ్యూహాన్ని మార్చే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటివరకు మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్న ఇరాన్.. పరిస్థితులు మరింత దిగజారితే ఆ పరిధిని విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇరాన్‌తో ‘‘వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను’’ నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీనికి ఒక రోజు ముందు.. ఇరాన్ నుంచి తమ ప్రాదేశిక జలాల వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు UAE రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఆ రెండు క్షిపణులు సముద్రంలోనే పడిపోయాయని, ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది.
ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య చర్చలు నిలిచిపోవడం, హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు కొనసాగడం, యూరప్‌లోని అమెరికా స్థావరాలను ఇరాన్ సంభావ్య లక్ష్యాలుగా పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తలతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి.
- Tags
- Europe attack
- Iran
- US War
తాజావార్తలు
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
-
Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
-
Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
-
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!