Pakistan-China: జిన్‌పింగ్‌తో షెహబాజ్ షరీఫ్ భేటీ.. కాశ్మీర్‌పై కవ్వింపులు.. మండిపడ్డ భారత్
- కవ్వింపులకు దిగుతోన్న దాయాది దేశం
- చైనా పర్యటనలో కాశ్మీర్‌పై పాకిస్థాన్ కవ్వింపు
- పాకిస్థాన్-చైనా వైఖరిపై మండిపడ్డ భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాయాది దేశం పాకిస్థాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. కాశ్మీర్ అంశాన్ని మరోసారి అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించేందుకే ఎత్తులు వేస్తోంది. తాజాగా చైనా పర్యటనతో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే ఈ వ్యవహారంపై భారతదేశం తీవ్రంగా మండిపడుతోంది.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. అయితే ఈ సందర్భంగా మరోసారి జమ్మూకాశ్మీర్ అంశాన్ని షరీఫ్ లేవనెత్తారు. ఇరువురి భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో కూడా జమ్మూకాశ్మీర్ అంశంపై చర్చించినట్లుగా పేర్కొన్నారు.
Also Read
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జమ్మూ కశ్మీర్ పరిస్థితులపై తాజా పరిణామాలను పాకిస్థాన్.. చైనా ప్రతినిధులకు వివరించినట్లు పేర్కొంది. దీనిపై స్పందించిన చైనా.. జమ్మూ కశ్మీర్ వివాదం “చారిత్రకంగా మిగిలిపోయిన సమస్య” అని పేర్కొంటూ.. ఐక్యరాజ్యసమితి చార్టర్, భద్రతామండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
సంయుక్త ప్రకటనలో ఉపయోగించిన పదజాలం గత 2024లో విడుదల చేసిన చైనా-పాకిస్థాన్ సంయుక్త ప్రకటనతో దాదాపు సమానంగా ఉండటం గమనార్హం. అప్పటికీ జమ్మూ కశ్మీర్‌ను “చరిత్రలో మిగిలిన వివాదం”గా పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం పరిష్కారం కావాలని రెండు దేశాలు పేర్కొన్నాయి.
అయితే ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. గతంలోనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారత్‌కు అంతర్భాగమని స్పష్టం చేసింది. ‘‘ఈ అంశంపై వ్యాఖ్యానించే హక్కు మరే దేశానికీ లేదు” అని భారత్ తేల్చిచెప్పింది. అలాగే చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC) ప్రాజెక్టులపై కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న భారత భూభాగంలో కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్నారని భారత్ ఆరోపించింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ పాకిస్థాన్ నిరంతరం ప్రయత్నాలు చేస్తుండగా.. ఇది పూర్తిగా భారత అంతర్గత విషయం అని భారత్ పదేపదే స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?