Pakistan: పాకిస్తాన్ తగలబడిపోతోంది. ఇస్లామిక అతివాద సంస్థ ‘‘తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP)’’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో తీవ్ర హింస చోటు చేసుకుంది. పోలీసులు, ప్రదర్శనకారులకు మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది. రాజధాని ఇస్లామాబాద్ వైపు వెళ్లేందుకు యత్నించిన నిరసనకారుల్ని పాక్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో లాహోర్ నగరం రణరంగంగా మారింది. ఇజ్రాయిల్‌కు మద్దతు నిలిచినందుకు వీరంతా, అమెరికా రాయబార కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
Read Also: Belly Fat Reduction: త్వరగా బొజ్జ తగ్గాలా..? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి..
ఈ నిరసనల్ని అణిచేందుకు ప్రయత్నించిన పంజాబ్ పోలీసుల్ని టీఎల్‌పీ ‘‘ఇజ్రాయిల్ గుండాలు’’గా పిలిచింది. దీంతో పంజాబ్ పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది నిరసనకారులు మరణించారని, 50 మందికి పైగా గాయపడ్డారని టీఎల్‌పీ చెప్పంది. గాజాలో ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా గురువారం నిరసనలు ప్రారంభమయ్యాయి. పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. లాహోర్‌లోని ఆజాదీ చౌక్ సమీపంలో ఘర్షణలు తీవ్రమయ్యాయి. పోలీసులు వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు, ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న నిరసనకారుల్ని అడ్డుకునేందుకు రోడ్లపై కంటైనర్లను మోహరించారు.
Latest situation of TLP protest in Shadara Lahore.#TLPprotest #Lahore pic.twitter.com/SJP38ryVvv
— Fakhar Yousafzai (@fakharzai7) October 11, 2025
