Site icon NTV Telugu

Pakistan: పాక్ ఆర్మీ, ప్రభుత్వం మధ్య విభేదాలు.. ఆఫ్ఘాన్‌తో ఘర్షణ పెంచుతున్న ఆసిమ్ మునీర్..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీకి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఆఫ్ఘానిస్తాన్‌తో శత్రుత్వం విషయంలో పాక్ ప్రభుత్వాన్ని కాదని ఆసిమ్ మునీర్ వ్యవరిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌పై దాడుల కోసం పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగిస్తోందని ఇటీవల తేలింది. ఆఫ్ఘాన్-పాక్ మధ్య టర్కీలో శాంతి చర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చల్లో భాగంగా పాక్ నుంచి డ్రోన్ దాడుల్ని అరికట్టాలని పాక్‌ను కోరగా, అందుకు పాక్ నిరాకరిస్తూ.. తమకు మూడో దేశంతో ఒప్పందం ఉన్నట్లు చెప్పింది. ఇక ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని పాక్ సైన్యం, ప్రభుత్వాన్ని కాదని ఆఫ్ఘానిస్తాన్‌పై దాడులు చేస్తోందని తేలింది.

పాకిస్తాన్ సైన్యం తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్రిక్తల్ని పెంచుకుంటోంది. మరోవైపు షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌తో స్నేహ సంబంధాలను కోరుకున్న ప్రతీసారి, పాక్ ఆర్మీ ఆఫ్ఘాన్‌పై దాడులు చేస్తోంది. సాధారణంగా ఏ దేశాధినేత అయిన, మరొక దేశానిధినేతలు మాత్రమే కలుస్తారు. పాకిస్తాన్ విషయంలో ట్రంప్ ఒకేసారి షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్‌లో భేటీ అవ్వడం చూస్తే, మునీర్‌కు ట్రంప్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అర్థం అవుతుంది. ట్రంప్ ఆఫ్ఘానిస్తాన్ లోని బగ్రామ్ ఎయిర్ బేస్‌ కోరుతున్నాడు, దీనికి పాక్ ఆర్మీ సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Yogi Adityanath: ‘‘ పప్పు, తప్పు, అక్కులు మూడు కోతులు ’’.. ముగ్గురు నేతలపై యోగి సెటైర్లు..

ఆఫ్ఘాన్‌తో చర్చల సమయంలో పాక్ ప్రభుత్వం దౌత్య సంబంధాల్లో ఉండగానే, ప్రభుత్వాన్ని కాదని ప్రాంతీయ ఉద్రిక్తతలు సజీవంగా ఉండేందుకు పాక్ సైన్యం కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇటీవల తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. ‘‘కాబూల్, ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశంతో పాకిస్తాన్‌లోని నిర్దిష్ట సైనిక వర్గానికి ప్రపంచ శక్తులు మద్దతు ఇవ్వవచ్చు’’ అని అన్నారు. పాకిస్తాన్ సైన్యం ఉద్దేశపూర్వకంగా రెండు దేశాల మధ్య సంబంధాలను చెడగొడుతున్నాయని అన్నారు. నిజానికి, పాకిస్తాన్ లో బయటకు ప్రజాస్వామ్యం కనిపిస్తున్నా అంతా నిడిపించేదు పాక్ ఆర్మీనే. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీ కాలంలో ఆఫ్ఘాన్-పాక్ సంబంధాలు సజావుగా జరిగాయని ముజాహిద్ అన్నారు. ఆ తర్వాత, ఆయనను పదవి నుంచి తొలగించారు. అనేక కేసుల్లో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు.

Exit mobile version