Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీకి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఆఫ్ఘానిస్తాన్‌తో శత్రుత్వం విషయంలో పాక్ ప్రభుత్వాన్ని కాదని ఆసిమ్ మునీర్ వ్యవరిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దాడుల కోసం పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగిస్తోందని ఇటీవల తేలింది.
Pakistan Seeks US Help: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాస్తవంగా దాయాది దేశం తాలిబన్ల దాడితో గజగజలాడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తొమ్మిదవ యుద్ధాన్ని కూడా నివారిస్తారా అనేది ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతుంది. ఆఫ్ఘన్‌తో ఘర్షణలు, తాత్కాలిక కాల్పుల విరమణ నుంచి తలెత్తే ఉద్రిక్తతల మధ్య పాక్ సహాయం కోసం అమెరికా అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకుంటున్నట్లు సమాచారం.…
United Nations: రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు సంస్థలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ఎఫెక్ట్, తాజాగా ఐక్యరాజ్యసమితి పైనా పడింది. పలు సంక్షోభ ప్రాంతాల్లో ఉన్న తమ శాంతి పరిరక్షకులను కుదించి తిరిగి వెనక్కి రప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Israel Strikes Qatar: అరబ్ దేశాల్లో అమెరికాకు అత్యంత మిత్రదేశంగా ఖతార్ ఉంటుంది. అలాంటి ఖతార్‌పై మంగళవారం ఇజ్రాయిల్ దాడులు చేసింది. రాజధాని దోహాలో ఉన్న హమాస్ పొలిటికల్ బ్యూర్ నేతలే టార్గెట్‌గా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అయితే, ఇదంతా అమెరికాకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. కానీ, ఇజ్రాయిల్ దాడి చేసే విషయాన్ని, అమెరికా ఖతార్‌కు ఆలస్యంగా తెలియజేసిందని తెలుస్తోంది. ఈ దాడికి అమెరికా అధ్యక్షుడు
India-US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన జాన్ మెయర్‌షీమర్, ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. ట్రంప్ పరిపాలన భారత విధానాన్ని ‘‘భారీ తప్పు’’గా అభివర్ణించారు. రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌పై సెకండరీ టారిఫ్స్ పనిచేయవని అన్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ప్రతిదాడులు చేస్తామంటూ ఐడీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్- ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో తన పరిపాలనా వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం లాంటి పరిస్థితిని నివారించడంలో అమెరికా పెద్ద దౌత్య విజయాన్ని సాధించిందని చెప్పారు. అయితే ఈ అంశంలో తనకు సరైన క్రెడిట్ ఇవ్వలేదని ట్రంప్ శనివారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వంశవ్యవస్థ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై స్పష్టమైన వైఖరి ఉన్న జేడీ వాన్స్ ఈ వివాదంలో అమెరికా పాత్రపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో తమ దేశం ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. Operation Sindoor 2:…
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీతో పాటు భారతదేశాన్ని సందర్శిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు రెండు దేశాల నాయకులతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.