Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇంటిలో పోలీసుల వీరంగం.. భార్య ఇంట్లో ఉండగా దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ రణరంగంగా మారుతోంది. గవర్నమెంట్ వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ గా వివాదం ముదురుతోంది. ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు వెళ్లగానే పాక్ పోలీసులు ఆయన ఇంట్లో వీరంగం సృష్టించారు. లాహోర్ లోని జమాన్ పార్క్ లో ఉన్న ఇమ్రాన్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయన లేని సమయంలో శనివారం ఇంట్లో ప్రవేశించారని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాప్ పార్టీ ఆరోపించింది. ఆయన భార్య బుష్రా బేగం ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారని ఆరోపించారు. అవినీతి ఆరోపణల కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో ఇదంతా జరిగింది.
Read Also: Covid Cases: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 4 నెలల్లో అత్యధికం!
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
పోలీసులు ఏ చట్టం ప్రకారం నా ఇంటిపై దాడి చేస్తున్నారంటూ, పరారీలో ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను క్విడ్ ప్రోకోగా అధికారంలోకి తీసుకురావడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారంంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. పోలీసులు తన ఇంటిపై దాచే వీడియోను పీటీఐ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పాకిస్తాన్ ప్రస్తుతం అంతర్యుద్ధం దిశగా వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు, పాక్ రేంజర్లు విఫలయత్నం చేశారు. ఆయన పార్టీ మద్దతుదారులు, ప్రజలు పోలీసులకు అడ్డుగా నిలిచారు. దీంతో జమాన్ పార్క్ యుద్ధవాతావరణాన్ని తలపించింది. చివకు లాహోర్ హైకోర్టు కలుగచేసుకుని తర్వాతి రోజుకు అరెస్టును వాయిదా వేయాల్సి వచ్చింది.
పాక్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్ కూడా ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు మద్దతు తెలిపినట్లు పాక్ మీడియా వెల్లడిస్తోంది. దీంతో ఏ క్షణానైనా ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తనను అరెస్ట్ చేసి ప్రభుత్వం, ఆర్మీ చంపాలని చూస్తుందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య పాక్ లో పరిస్థితి రోజురోజు ఉద్రిక్తంగా మారుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ లో రాజకీయ అస్థిరత చోటు చేసుకుంది.
Worst kind of torture in Zaman Park right now. If something happens, will you paint it as accident again!? #چلو_چلو_عمران_کے_ساتھ pic.twitter.com/5S45UDVvMZ
— PTI (@PTIofficial) March 18, 2023
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!