Trump Saviour: ట్రంప్ రక్షకుడు అంటూ పాక్ ప్రధాని ప్రశంసలు.. గట్టిగానే ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
- ట్రంప్ రక్షకుడు అంటూ పాక్ ప్రధాని ప్రశంసలు..
- భారత్- పాక్ యుద్ధం ట్రంప్ వలన ఆగిపోయింది..
- గాజాలో శాంతి, పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరిన పాక్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Saviour: అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన శాంతి సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ట్రంప్‌ను “శాంతి దూత”, “దక్షిణాసియాకు రక్షకుడు” అని పాక్ పీఎం అభివర్ణించారు. అయితే, భారత్- పాకిస్థాన్ మధ్య గత ఏడాది జరిగిన సైనిక ఉద్రిక్తత సమయంలో ట్రంప్ జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణ సాధ్యమైందని పేర్కొన్నారు. ట్రంప్ సమయానికి జోక్యం చేసుకోవడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివాదాలను పరిష్కరించడంలో డొనాల్డ్ ట్రంప్ ధైర్యవంతమైన దౌత్యాన్ని ప్రదర్శించారని షెహ్బాజ్ షరీఫ్ కొనియాడారు.
Read Also: Dasun Shanaka: కలలో కూడా ఊహించలేదు, అవమానకర ఓటమి.. జింబాబ్వేపై ఓటమిపై షనక సంచలన వ్యాఖ్యలు
Also Read
అయితే, గాజాలో శాశ్వత శాంతి సాధిస్తే మాత్రం డొనాల్డ్ ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారని పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అన్నారు. అలాగే, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇక, మరోసారి భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతను తానే తగ్గించానని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు. రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి.. యుద్ధం చేస్తే, భారీ సుంకాలు విధిస్తానని నేను హెచ్చరించడంతో వారు వెనక్కి తగ్గారని తెలిపారు. భారత్ పాకిస్థాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని ట్రంప్ గుర్తు చేశారు. ఈ విషయంపై భారత్ పలుమార్లు స్పందిస్తూ, అమెరికా మధ్యవర్తిత్వం ఏం ఖండించింది.
Read Also: Rebel Star : ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీమ్ తో రెబల్ స్టార్ ఫన్ చాట్.. ప్రభాస్ లుక్ వైరల్
ఇక, డొనాల్డ్ ట్రంప్ ని “శాంతి దూత”, “దక్షిణాసియాకు రక్షకుడు” అంటూ పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. షరీఫ్ నీకు ఇంతనైనా బుద్ధి ఉందా అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు నెటిజన్స్.. సిగ్గు లేకుండా అమెరికా దగ్గర మీ దేశం పరువును తాకట్టు పెట్టావు.. భారత్ కి భయపడి ట్రంప్ కాళ్ల మీద పడి యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపగలిగావు అంటూ విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!