Site icon NTV Telugu

Pakiatan: ‘‘ నెతన్యాహూను కిడ్నాప్ చేయండి’’.. ట్రంప్‌ను కోరిన పాకిస్తాన్..

Khawaja Asif

Khawaja Asif

Pakiatan: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అమెరికా కిడ్నాప్ చేయాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ కోరారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను తీసుకెళ్లినట్లే నెతన్యాహూను కూడా కిడ్నాప్ చేయాలని అన్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా చెత్త నేరస్తుడు అని నెతన్యాహూను పాక్ నిందించింది. టర్కీ కూడా నెతన్యాహూను కిడ్నాప్ చేయలగలదని, పాకిస్తానీయులు దాని కోసం ప్రార్థిస్తున్నారని అన్నారు.

Read Also: Duddilla Sridhar Babu : నిరుద్యోగుల పట్ల ‘బీఆర్ఎస్’ది కపట ప్రేమే.

గురువారం ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడా జరగని దురాగతాలు గాజాలో పాలస్తీనియన్లపై జరిగాయని అన్నారు. గత 4000-5000 సంవత్సరాలుగా ఇజ్రాయిల్ పాలస్తీనియన్లకు చేసినట్లుగా ఎవరూ చేయలేదని, నెతన్యాహూ మానవత్వంలో అతిపెద్ద నేరస్తుడని, ప్రపంచం ఇంతకన్నా పెద్ద నేరస్తుడిని చూడలేదని దుయ్యబట్టారు. ఇలాంటి నేరస్తులకు మద్దతు ఇచ్చే వారి గురించి ఏం చెబుతాం అని అనడంతో యాంకర్ కలుగజేసుకున్నారు. పరోక్షంగా ఇవి ట్రంప్‌ను తిట్టే పరిస్థితి రావడంతో యాంకర్ హమీద్ మీరు ఆపారు. ఇజ్రాయిల్‌ను పాకిస్తాన్ ఎప్పుడూ గుర్తించలేదు, ఇరాన్‌తో తమ సంబంధాలు సోదరభావం, భాగస్వామ్య ప్రాంతీయ ప్రయోజనాలకు సంబంధించిందని పాక్ రక్షణ మంత్రి అన్నారు.

మరోవైపు, గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ (ISF)లో భాగంగా పాక్ సైనికులు గాజాకు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడారు. పాకిస్తాన్ సైన్యం గాజాలో ఉండటంపై ఇజ్రాయిల్ సంతోషంగా లేదని అన్నారు. హమాస్, లష్కరేతోయిబా మధ్య సంబంధాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Exit mobile version