Russian Women: రష్యా నుంచి గర్భిణీలు పరార్.. వెలుగులోకి సంచలన నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Over 5000 Pregnant Russian Women Entered Argentina For Citizenship: రష్యాకు చెందిన గర్భిణీ స్త్రీలు దేశం విడిచి.. అర్జెంటీనాకు వలస వెళ్తున్నారు. గతకొన్ని నెలల నుంచి మొదలైన ఈ వలసల్లో భాగంగా ఇప్పటివరకూ 5 వేల మంది గర్భిణీ మహిళలు అర్జెంటీనా పౌరసత్వం పొందారు. వీళ్లందరూ ఇలా రష్యా విడిచి అర్జెంటీనాకు వెళ్లడానికి కారణం.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధమే! ఈ యుద్ధం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న భయంతో.. అర్జెంటీనాకు తరలి వెళ్తున్నారు. ఇటీవల కాలంలో అర్జెంటీనకు వెళ్తున్న రష్యా మహిళల సంఖ్య మరింత పెరిగిందని.. ఒక్క గురువారంనాడే 33 మంది మహిళలు వెళ్లారని తేలింది. తొలుత పర్యాటకులుగా అక్కడ పాదం మోపి.. ఆ తర్వాత అర్జెంటీనా పౌరసత్వం పొందుతున్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.
Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 27 ఫైరింజన్లు
Also Read
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ఇప్పుడున్న పరిస్థితుల్లో.. రష్యాలో కంటే అర్జెంటీనాలోనే ఎక్కువ స్వేచ్ఛ ఉండటంతో, తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం ఉండాలని రష్యా గర్భిణీలు కోరుకుంటున్నారు. అర్జెంటీనా వీసాతో కలిగే ఓ గొప్ప ప్రయోజనం ఏమిటంటే.. అర్జెంటీనా వీసా హోల్డర్స్ 171 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. కానీ.. రష్యా వీసా కలిగిన వాళ్లు 87 దేశాలు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించడానికి అనుమతి ఉంది. మరోవైపు.. రష్యా నుంచి గర్భిణీలు ఇలా తరలివెళ్తున్న తరుణంలో, ఓ రష్యన్ వెబ్సైట్ అర్జెంటీనాపై అక్కసు వెళ్లగక్కింది. అర్జెంటీనాలో ప్రసవించే గర్భిణీలకు అక్కడి ప్రభుత్వం వివిధ ప్యాకేజీలు అందిస్తోందని, ఇదొక మిలియన్ డాలర్ల అక్రమ వ్యాపారమని పేర్కొంది. అంతేకాదు.. రష్యన్ మహిళలకు, వారి భాగస్వామ్యులకు అర్జెంటీనాలోనే స్థిరపడేలా నకిలీ పత్రాలను జారీ చేస్తోందని రాసుకొచ్చింది. ఇది పచ్చి అబద్ధమని అర్జెంటీనా అధికారులు స్పష్టం చేశారు.
Lover Betrayed: ప్రేమన్నాడు.. కోరిక తీరాక పొమ్మన్నాడు.. కట్ చేస్తే..
ఇదిలావుండగా.. గురువారంనాడు అర్జెంటీనాకు తరలివెళ్లిన 33 మంది మహిళల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడం వల్లే అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఆ ముగ్గురి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తప్పుడు పర్యాటకులన్న అనుమానంతో వారిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!