Site icon NTV Telugu

Obama: చార్లీ కిర్క్ హత్యపై ఒబామా కీలక వ్యాఖ్యలు

Obama

Obama

ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. చార్కీ కిర్క్ వాదనలతో తాను ఏకీభవించడం లేదని తేల్చి చెప్పారు. ఇక చార్లీ హత్య తర్వాత ట్రంప్.. దేశాన్ని ఏకం చేయడం కాకుండా.. దేశాన్ని విభజిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం రాత్రి పెన్సిల్వేనియాలోని ఎరీలో జెఫెర్సన్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఒబామా మాట్లాడారు. ఒక మోడరేటర్ అడిగిన ప్రశ్నలకు ఒబామా సమాధానమిస్తూ.. చార్లీ హత్య తర్వాత ట్రంప్ నిర్ణయాలు ఏ మాత్రం ఆమోద యోగ్యంగా లేవని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఈసీపై మరో బాంబ్ పేల్చిన రాహుల్ గాంధీ

చార్లీ కిర్క్‌కు సంబంధించి అనేక విషయాల్లో తాను విభేదిస్తున్నట్లు వెల్లడించారు. హత్య తర్వాత ఒక మలుపు తిరిగిన స్థితిలో ఉందని.. అలాంటి సమయంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి బదులుగా దేశాన్ని మరింత విభజించారని ట్రంప్‌పై ఒబామా ధ్వజమెత్తారు. ఇదేమీ బాగోలేదన్నారు.

ఇది కూడా చదవండి: Delhi: పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై స్పందించిన భారత్

ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సూత్రం ఏంటంటే.. హింసను ఎవరూ ప్రోత్సహించకూడదని అభిప్రాయపడ్డారు. 2015లో సౌత్ కరోలినాలోని చార్లెస్టన్ చర్చిలో తొమ్మిది మంది నల్లజాతి పారిష్‌వాసుల హత్య తర్వాత డెమొక్రాట్ తన సొంత నాయకత్వం గురించి, సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడుల తర్వాత అప్పటి రిపబ్లికన్ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ చర్యల గురించి గుర్తుచేశారు. సంక్షోభంలో అధ్యక్షుడి పాత్ర అందరినీ ఏకతాటికి నడిపించడమే ప్రధాన సూత్రం అన్నారు. అప్పుడు అదే జరిగిందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు చార్లీ కిర్క్.. రాజకీయ ప్రత్యర్థులను ‘‘క్రిమికీటకాలు, శత్రువులు …’’ అని పిలవడం ఎంత వరకు కరెక్ట్ అని అడిగారు. ఇక హత్య తర్వాత రాడికల్ లెఫ్ట్‌ అణిచివేస్తామని ట్రంప్ బెదిరించడం ఏ మాత్రం సరైంది కాదన్నారు.

ఇక చార్లీ కిర్క్ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నామని.. ఏ విధమైన హింసకు ప్రజాస్వామ్యంలో చోటులేదని ఒబామా ఎక్స్‌లో పేర్కొన్నారు. జరిగింది విషాదమే కానీ.. కొన్ని విషయాల్లో చార్లీని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. అనంతరం 22 ఏళ్ల రాబిన్సన్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వర్గం ద్వేషం రగిలించడం వల్లే చార్లీని చంపినట్లుగా నిందితుడు చెప్పినట్లు సమాచారం.

Exit mobile version