Obama: చార్లీ కిర్క్ హత్యపై ఒబామా కీలక వ్యాఖ్యలు
- చార్లీ కిర్క్ హత్యపై ఒబామా కీలక వ్యాఖ్యలు
- ట్రంప్ తీరు ఏ మాత్రం బాగోలేదని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. చార్కీ కిర్క్ వాదనలతో తాను ఏకీభవించడం లేదని తేల్చి చెప్పారు. ఇక చార్లీ హత్య తర్వాత ట్రంప్.. దేశాన్ని ఏకం చేయడం కాకుండా.. దేశాన్ని విభజిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం రాత్రి పెన్సిల్వేనియాలోని ఎరీలో జెఫెర్సన్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఒబామా మాట్లాడారు. ఒక మోడరేటర్ అడిగిన ప్రశ్నలకు ఒబామా సమాధానమిస్తూ.. చార్లీ హత్య తర్వాత ట్రంప్ నిర్ణయాలు ఏ మాత్రం ఆమోద యోగ్యంగా లేవని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఈసీపై మరో బాంబ్ పేల్చిన రాహుల్ గాంధీ
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
చార్లీ కిర్క్‌కు సంబంధించి అనేక విషయాల్లో తాను విభేదిస్తున్నట్లు వెల్లడించారు. హత్య తర్వాత ఒక మలుపు తిరిగిన స్థితిలో ఉందని.. అలాంటి సమయంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి బదులుగా దేశాన్ని మరింత విభజించారని ట్రంప్‌పై ఒబామా ధ్వజమెత్తారు. ఇదేమీ బాగోలేదన్నారు.
ఇది కూడా చదవండి: Delhi: పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై స్పందించిన భారత్
ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సూత్రం ఏంటంటే.. హింసను ఎవరూ ప్రోత్సహించకూడదని అభిప్రాయపడ్డారు. 2015లో సౌత్ కరోలినాలోని చార్లెస్టన్ చర్చిలో తొమ్మిది మంది నల్లజాతి పారిష్వాసుల హత్య తర్వాత డెమొక్రాట్ తన సొంత నాయకత్వం గురించి, సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడుల తర్వాత అప్పటి రిపబ్లికన్ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ చర్యల గురించి గుర్తుచేశారు. సంక్షోభంలో అధ్యక్షుడి పాత్ర అందరినీ ఏకతాటికి నడిపించడమే ప్రధాన సూత్రం అన్నారు. అప్పుడు అదే జరిగిందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు చార్లీ కిర్క్.. రాజకీయ ప్రత్యర్థులను ‘‘క్రిమికీటకాలు, శత్రువులు …’’ అని పిలవడం ఎంత వరకు కరెక్ట్ అని అడిగారు. ఇక హత్య తర్వాత రాడికల్ లెఫ్ట్ అణిచివేస్తామని ట్రంప్ బెదిరించడం ఏ మాత్రం సరైంది కాదన్నారు.
ఇక చార్లీ కిర్క్ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నామని.. ఏ విధమైన హింసకు ప్రజాస్వామ్యంలో చోటులేదని ఒబామా ఎక్స్‌లో పేర్కొన్నారు. జరిగింది విషాదమే కానీ.. కొన్ని విషయాల్లో చార్లీని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. అనంతరం 22 ఏళ్ల రాబిన్సన్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వర్గం ద్వేషం రగిలించడం వల్లే చార్లీని చంపినట్లుగా నిందితుడు చెప్పినట్లు సమాచారం.
తాజావార్తలు
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..