Site icon NTV Telugu

Vladimir Putin: ఇరాన్ అణ్వాయుధాలను కోరుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు..

Puthin

Puthin

Vladimir Putin: ఇరాన్ పెద్ద మొత్తంలో అణ్వాయుధాలను తయారు చేస్తోందని.. దాని వల్ల తమ అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉండడంతో అక్కడి అణు కేంద్రాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఈ అంశంపై తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల తయారీకి ఇరాన్‌ ప్లాన్ చేస్తోందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్‌కు అనేక సార్లు స్పష్టం చేశామని తెలిపారు. శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు ఇరాన్‌కు ఉంది.. ఈ విషయంలో ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి రష్యా ఎప్పటికీ రెడీగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలా ఆపాలనే విషయంపై తాము ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

Read Also: TS EdCET: టీజీ ఎడ్‌సెట్‌-2025 ఫలితాలు విడుదల..

అయితే, ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామంటూ కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ బహిరంగంగానే సవాల్‌ విసురుతుంది. ఈ నేపథ్యంలో అణ్వాయుధాలను డెవలప్ చేసుకునేందుకు టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇజ్రాయెల్ కు నిఘా వర్గాల సమాచారం రావడంతో వాటిని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో టెల్‌ అవీవ్‌ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌పై దాడులకు దిగాడు. ఇటీవలి కాలంలో ఇరాన్‌ భారీగా యురేనియంను శుద్ధి చేసింది.. దాంతో తొమ్మిది అణుబాంబులు తయారు చేయొచ్చని అతడు చెప్పుకొచ్చాడు. ఇప్పుడా దేశాన్ని ఆపకపోతే.. అతి తక్కువ సమయంలోనే అణ్వాయుధాలను తయారు చేస్తుందని అన్నాడు. అది ఇజ్రాయెల్‌కు పెను ముప్పుగా పరిణమిస్తుందని అన్నాడు. నాజీల దురాగతాల నుంచి తాము గుణపాఠం నేర్చుకున్నాం కాబట్టి.. మరోసారి బాధితులుగా మిగలాలనుకోవట్లేదని.. అందుకే ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ పేరుతో ఇరాన్ పై దాడులు చేస్తున్నామని బెంజమిన్ నెతాన్యహు తెలిపారు.

Exit mobile version