Vladimir Putin: ఇరాన్ అణ్వాయుధాలను కోరుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు..
- ఇరాన్ అణ్వాయుధాలను కోరుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు..
- శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు ఇరాన్‌కు ఉంది..
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి చర్చలు కొనసాగుతున్నాయి: పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin: ఇరాన్ పెద్ద మొత్తంలో అణ్వాయుధాలను తయారు చేస్తోందని.. దాని వల్ల తమ అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉండడంతో అక్కడి అణు కేంద్రాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఈ అంశంపై తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల తయారీకి ఇరాన్ ప్లాన్ చేస్తోందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్‌కు అనేక సార్లు స్పష్టం చేశామని తెలిపారు. శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు ఇరాన్‌కు ఉంది.. ఈ విషయంలో ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి రష్యా ఎప్పటికీ రెడీగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలా ఆపాలనే విషయంపై తాము ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
Read Also: TS EdCET: టీజీ ఎడ్‌సెట్-2025 ఫలితాలు విడుదల..
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
అయితే, ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామంటూ కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ బహిరంగంగానే సవాల్ విసురుతుంది. ఈ నేపథ్యంలో అణ్వాయుధాలను డెవలప్ చేసుకునేందుకు టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇజ్రాయెల్ కు నిఘా వర్గాల సమాచారం రావడంతో వాటిని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో టెల్ అవీవ్ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌పై దాడులకు దిగాడు. ఇటీవలి కాలంలో ఇరాన్ భారీగా యురేనియంను శుద్ధి చేసింది.. దాంతో తొమ్మిది అణుబాంబులు తయారు చేయొచ్చని అతడు చెప్పుకొచ్చాడు. ఇప్పుడా దేశాన్ని ఆపకపోతే.. అతి తక్కువ సమయంలోనే అణ్వాయుధాలను తయారు చేస్తుందని అన్నాడు. అది ఇజ్రాయెల్‌కు పెను ముప్పుగా పరిణమిస్తుందని అన్నాడు. నాజీల దురాగతాల నుంచి తాము గుణపాఠం నేర్చుకున్నాం కాబట్టి.. మరోసారి బాధితులుగా మిగలాలనుకోవట్లేదని.. అందుకే ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్ పై దాడులు చేస్తున్నామని బెంజమిన్ నెతాన్యహు తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!