దీపావళి వేడుకల్లో ప్రధాని మోడీ లక్ష్యంగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ విమర్శలు గుప్పించారు. క్వీన్స్‌లోని హిందూ దేవాయాలను సందర్శించిన తర్వాత భారతీయులను ఉద్దేశించి మమ్దానీ ప్రసంగించారు. భారతదేశంలో కొన్ని రకాల భారతీయులకు మాత్రం స్థలం ఉందని.. అదే దార్శనికతతో భారతదేశాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
తాను బహుత్వవాదాన్ని జరుపుకునే భారతదేశంలో పెరిగినట్లు చెప్పుకొచ్చారు. అక్కడ అనేక పాఠాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. భారతీయ సాంప్రదాయం, సంస్కృతి తనకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చారు. అందుకే తాను మోడీని విమర్శిస్తున్నట్లు తెలిపారు. న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని.. తాను అందరినీ ఒకేలాగా చూస్తానని చెప్పారు. ఎందుకంటే న్యూయార్క్ ప్రజలు సురక్షితంగా ఉండేలా చూసుకోవడం తన బాధ్యత అని వివరించారు.
ఇది కూడా చదవండి: Prashant Kishor: ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ల విత్‌డ్రా.. బీజేపీ ఒత్తిడితోనే జరిగిందన్న ప్రశాంత్ కిషోర్
న్యూయార్క్ చరిత్రలో తొలిసారి ఒక ముస్లిం వ్యక్తి మేయర్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో డెమోక్రటిక్ మేయర్ ప్రైమరీలో మమ్దానీ విజయం సాధించారు. మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత మమ్దానీ.. ప్రధాని మోడీని, బీజేపీని లక్ష్యంగా చేసుకుని పలుమార్లు విమర్శలు గుప్పించారు. గతంలో ఒకసారి మోడీ ‘‘యుద్ధ నేరస్థుడు’’ అంటూ సంబోధించారు. ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరికీ ఒకే రకమైన పోలికలు ఉన్నాయని.. ఇద్దరూ యుద్ధ నేరస్థులు అంటూ ముద్ర వేశారు. అంతేకాకుండా 2002లో గుజరాత్ అల్లర్లపై మోడీకి సంబంధించిన ఒక పాత వీడియోను కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ముస్లింలు గుజరాత్ నుంచి నిర్మూలింపబడ్డారని ఆరోపించారు. భారతదేశంలో ముస్లింల ఉనికి లేకుండా పోతుందని.. దీనికి పాలకుల వైఖరే కారణమంటూ మమ్దానీ ప్రస్తావించారు.
Last night I visited four temples across Queens to celebrate the Hindu Festival of Lights, ending at Maharaja Sweets in Jackson Heights, where we gave out six kinds of delicious treats alongside some very special guests. Happy Diwali, NYC! pic.twitter.com/MKZB6UnrsT
— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) October 21, 2025