Benjamin Netanyahu: మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాం, మాతో కలిసి రండి..
- మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాము..
- మాకు సహకరించాలి..
- ప్రపంచ దేశాలను కోరిన నెతన్యాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రంగా మారుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యామూ ఆదివారం ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయిల్‌కు మాత్రమే ప్రమాదం కాదని, యావత్ ప్రపంచానికి ప్రమాదమని హెచ్చరించారు. శనివారం ఇజ్రాయిల్‌లోని అరద్ నగరంపై ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల తర్వాత ఆయన అరద్‌లో పర్యటించించారు.
డియాగో గార్సియాపై ఇటీవల జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, నెతన్యాహు ప్రపంచాన్ని హెచ్చరించారు. ఇరాన్ 4,000 కిలోమీటర్ల పరిధి గల క్షిపణిని ప్రయోగించిందని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రకారం, ఇరాన్‌కు ఇప్పుడు యూరప్‌లోని లోపలి ప్రాంతాలలో కూడా విధ్వంసం సృష్టించే సామర్థ్యం ఉందని తాను చాలాకాలంగా చెబుతూ వస్తున్నానని తెలిపారు. ఇరాన్ ఇప్పటిక సైప్రస్, యూరోపియన్ దేశాలు లక్ష్యంగా దాడులు చేస్తోందని అన్నారు. గత 48 గంటల్లో నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసిందిని ఇజ్రాయిల్ ప్రధాని చెప్పారు. ఇరాన్ సామూహిక మారణహోమానికి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
Also Read
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
Read Also: Israel: ఇజ్రాయెల్ అణ్వాయుధ రహస్యం.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ‘చివరి నిర్ణయం’ ఏమిటి..?
జెరూసలేం లాంటి పవిత్ర ప్రాంతాలపై దాడుల్ని నెతన్యాహూ ప్రస్తావించారు. యూదులు, ఇస్లాం, క్రైస్తవానికి ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగించిందని అన్నారు. వెస్ట్రన్ వాల్, చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ , అల్-అక్సా మసీదులను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్షిపణుల శకలాలు ఈ ప్రాంతాల్లో పడ్డాయని చెప్పారు.
ఈ తీవ్రవాద పాలనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గట్టిగా మద్దతు తెలిపారు. యావత్ ప్రపంచ భద్రత కోసం ఇజ్రాయెల్, అమెరికా కలిసి పోరాడుతున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. ఇంధన సరఫరా, సముద్ర మార్గాలను అడ్డుకోవడం ద్వారా ఇరాన్ బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోందని, ఈ చర్యలకు ప్రపంచం మొత్తం ఏకం కావాలని నెతన్యాహూ కోరారు. ఇరాన్ మిస్సైల్ ప్రోగ్రాం నాశనం చేయడం, అక్కడి ప్రజలు నియంతృత్వాన్ని కూలదోసేలా చేయడం తమ లక్ష్యాలని నెతన్యాహూ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!