Site icon NTV Telugu

Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

Netanyahu5

Netanyahu5

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విరుచుకుపడ్డారు. ఉగ్రవాద పాలన, అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో మానవాళిని ఇరాన్ బెదిరించాలని చూసిందని.. అందుకోసమే దాని బారి నుంచి రక్షించుకోవడం కోసమే బయల్దేరినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. జెరూసలేం పశ్చిమాన ఉన్న బీట్ షెమెష్‌లో ఇరాన్ జరిపిన దాడి ప్రదేశాన్ని నెతన్యాహు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇరాన్ ఉగ్రవాదం నుంచి చాలా మందిని రక్షించామని.. ఇప్పుడు ప్రపంచాన్ని రక్షించే కీలక ప్రయత్నంలో తోడైన గొప్ప స్నేహితుడు, ప్రపంచ గొప్ప నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

అమెరికాతో కలిసి ప్రపంచానికి కలిగే ముప్పును అడ్డుకోవడానికి బయల్దేరినట్లు చెప్పారు. ‘‘టెహ్రాన్ నిరంకుశులు.. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇజ్రాయెల్‌నే కాదు.. అమెరికాను కూడా బెదిరిస్తోంది.. నేను చాలా ఏళ్లుగా చెబుతున్నా.. ఇజ్రాయెల్‌కు మరణం.. అమెరికాకు మరణం అని నినాదాలు చేస్తున్నారు. అదే వారి అంతిమ లక్ష్యం. కానీ వారు యూరప్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.’’ అని పేర్కొన్నారు. ఇరాన్ పాలన ఉగ్రవాద పాలనగా నెతన్యాహు అభివర్ణించారు.

Exit mobile version