Nepal Gen Z protest: అధ్యక్షుడి భవనంలో నిరసనకారుల విధ్వంసం.. మంత్రుల ఇళ్లు లక్ష్యంగా దాడులు
- అధ్యక్షుడి భవనంలో నిరసనకారుల విధ్వంసం
- మంత్రుల ఇళ్లు లక్ష్యంగా దాడులు
- దుబాయ్ పారిపోతున్న ప్రధాని ఓలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్‌లో రెండో రోజు కూడా రణరంగంగా మారింది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలంటూ సోమవారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం దిగొచ్చి బ్యాన్ ఎత్తేసింది. అయితే పోలీసుల కాల్పుల్లో 20 మంది నిరసనకారులు చనిపోయారు. దీంతో మంగళవారం కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. తక్షణమే కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక మంత్రుల ఇళ్లను ముట్టడించి తగలబెట్టారు. తాజాగా అధ్యక్షుడి భవనంలోకి చొరబడి నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఫొటోలు, వస్తువులను పగలగొట్టారు. అలాగే మంత్రుల ఇళ్లు లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Prashant Kishor: జేడీయూకు ప్రశాంత్ కిషోర్ సవాల్.. 25 కంటే ఎక్కువ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానని శపథం
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఇదిలా ఉంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని ఓలి దుబాయ్ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేటు విమానాన్ని సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైద్య పరీక్షల కోసమే ఓలి దుబాయ్ వెళ్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశానికి ప్రధాని పిలుపునిచ్చారు. తాజా పరిణామాలపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Teja Sajja : స్టార్ డైరెక్టర్ చీట్ చేశాడు.. ఆ రోజులు మర్చిపోలేను
ఇక రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి చెందిన 21 ఎంపీలు మూకుమ్మడి రాజీనామా చేశారు. నిరసనలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
నిరసనలకు కారణం ఇదే..
దేశంలో ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ సహా పలు సోషల్ నెట్‌వర్కులపై గత వారం ప్రభుత్వం బ్యాన్ విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఖాట్మండులో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఈ ఘటనలో 20 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ‘‘సోషల్ మీడియాపై నిషేధం కాదు.. అవినీతిపై నిషేధం విధించండి’’ అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలు ఊపుతూ నినాదాలుు చేశారు. దాదాపు 10 వేల మందికి పైగా జనాలు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు.

తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..