యువత తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయంటారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వమే ఇందుకు నిదర్శనం. గతేడాది విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గి.. రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్‌కు పారిపోయి వచ్చేశారు. తాజాగా నేపాల్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తింది.
నేపాల్లో రెండో రోజు కూడా రణరంగంగా మారింది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలంటూ సోమవారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం దిగొచ్చి బ్యాన్ ఎత్తేసింది.
Nepal Protest: నేపాల్లో అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఇటీవల 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ‘జనరేషన్ – జెడ్ (Gen Z) విప్లవం’గా పేరుపొందింది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంటు సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 12 ఏళ్ల బాలుడు సహా కనీసం 19 మంది మరణించారు.…