Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..

  • నేపాల్‌లో ఆదివారం సాయంత్రం 3.8 తీవ్రతతో భూకంపం.
  • భూకంప కేంద్రం 20 కి.మీ. లోతులో ఉన్నట్లు నివేదిక.
  • వరద విలయంతో అల్లాడుతున్న నేపాల్‌ను భయపెట్టిన ప్రకంపనలు..
Earthquake

Earthquake

Nepal Earthquake: ఆకస్మిక వరదలు నేపాల్‌తో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడటంతో భోటేకోశి, త్రిశూలి నదులు ఉప్పొంగి ప్రవహించాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను నామరూపాలు లేకుండా చేసింది. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇదిలా ఉంటే, ఇలాంటి విపత్తతో బాధపడుతున్న హిమాలయ దేశాన్ని, భూకంపం వణికేలా చేసింది.

ఆదివారం సాయంత్రం నేపాల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. భూమికి సుమారు 20 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగలేదు. అంతకుముందు ఆగస్టు 27న 3.2 తీవ్రతతో భూకంపం వచ్చింది.

ఆగస్టు 26న నేపాల్‌లో సంభవించిన వరదల మూలంగా 1344 మంది మృతి చెందగా, 5000 మంది గల్లంతయ్యారు. 13,100 మందిని అధికారులు రక్షించారు. ఇప్పటికీ గల్లంతైన వారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతోంది. ఈ సమయంలో నేపాల్‌లో భూకంపం రావడం అక్కడి ప్రజల్ని భయపెడుతోంది.