కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధంగా మారింది. ప్రపంచంలో ఇప్పటికే పలురకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అభివృద్ది చెందిన దేశాల్లో వ్యాక్సిన్ కొరత లేకున్నా, టీకాలు తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అనేక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ వ్యాక్సినేషన్ మందకోడిగా సాగుతున్నది. అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి, తిరిగి పెరుగుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా అంటువ్యాధుల నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి రీఇన్ఫెక్షన్ ముప్పు 2.34 రెట్లు అధికంగా ఉందని, గతంలో కోవిడ్ బారిన పడిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సిడీసీ నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాక్సిన్ తీసుకోని వారికి రెండోసారి కరోనా వైరస్ సోకే అవకాశం అధికంగా ఉందని, వ్యాక్సిన్ తీసుకోని వారి వలన ఎక్కువగా వైరస్ వ్యాపిస్తోందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.