Artemis 2: అంతరిక్ష ప్రయాణంలో కొత్త చరిత్ర.. చంద్రుడిని చేరిన ఆర్టిమిస్-2
- చరిత్ర సృష్టించిన ఆర్టిమిస్-2..
- చంద్రుడి గ్రావిటీ పరిధిలోకి వ్యోమనౌక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Artemis 2: అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్ర నమోదైంది. మానవసహిత అంతరిక్ష యాత్రలలో అద్భుతం జరిగింది. ఆర్టిమిస్ -2 మిసన్ చంద్రుని గ్రావిటేషనల్ పరిధిలోకి చేరింది. 1972 డిసెంబర్ నుంచి ఏ మానవుడు కూడా భూమి కక్ష్యను దాటి వెళ్లలేదు. ఏప్రిల్ 2, 2026న దీనికి నాసా ఆర్టిమిస్-2 మిషన్ ముగింపు పలిచింది. ఈ మిషన్ ద్వారా ప్రయాణించిన వ్యోమగాములు భూమి నుంచి 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్ర రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డు కన్నా ఇది సుమారుగా 2500 కి.మీ ఎక్కువ.
రికార్డ్ క్రియేట్ చేసిన ఆర్టిమిస్-2:
Also Read
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
ఆర్టిమిస్ -2 ఏప్రిల్ 7, 2026న భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 12.15 గంటలకు చంద్రుడి సమీప యాత్రను ప్రారంభించనుంది. వ్యోమగాలులు చంద్రుడి అవతలి వైపు వెళ్లనున్నారు. భూమికి చంద్రుడికి మధ్య దూరం సుమారుగా 3,84,633 కిలోమీటర్లు. 1972లో అపోలో శకం ముగిసిన తర్వాత మొదటిసారిగా చంద్రుడి అవతలి పక్క భాగాన్ని దాటిన రికార్డ్ ఆర్టిమిస్ -2 పేరిట ఉండబోతోంది.
ఇంజన్ ఫెయిల్ అయినా భూమిని చేరుతుంది:
ఆర్టిమిస్-2 ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అనే పిలవబడే మార్గంలో ప్రయాణిస్తోంది. అంటే, ఈ అంతరిక్ష నౌక తిరిగి భూమిపైకి రావడానికి ప్రత్యేకంగా ఇంజన్లను మండించాల్సిన అవసరం లేదు. చంద్రుడిని గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి సహజంగా భూమి వైపు వస్తుంది. ఒక వేళ ఇంజన్ ఫెయిల్ అయినప్పటికీ, చంద్రుడి గ్రావిటీని ఉపయోగించి సురక్షితగంగా తిరిగి రావచ్చు.
సుదూర విశ్వం ఎందుకంత భిన్నం:
భూమికి 2000 కి.మీ ఎత్తు వరకు ఉన్న ప్రాంతంలో ఉపగ్రహలకు, అంతరిక్ష నౌకలు, అందులో ఉన్న వ్యోమగాములకు భూమి అయస్కాంత క్షేత్రం(ఎర్త్ మాగ్నిటిక్ ఫీల్డ్) రక్షణ కల్పిస్తుంది. సూర్యుడు, సుదూర విశ్వం నుంచి వచ్చే హానికరమైన రేడియేషన్‌ను భూమి మాగ్నిటిక్ ఫీల్డ్ పక్కకు తప్పిస్తుంది.
వ్యోమనౌక భూమి వాతావరణంలోకి వచ్చేటప్పుడు దాదాపుగా 2760 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. వ్యోమనౌకకు ఉండే హీట్ షీల్డ్ ఈ వేడి నుంచి రక్షిస్తుంది. ఈ సమయంలో వాతావరణ ఘర్షణ వల్ల ఇంత వేడి జనరేట్ అవుతుంది. రీఎంట్రీ సమయంలో దాని వేగం గంటకు 40,200 కి.మీ ఉంటుంది.
ఈ మిషన్ చంద్రుడి కోసం కాదు. భవిష్యత్తులో మార్స్ మిషన్ కోసం ట్రయల్ రన్‌గా భావిస్తున్నారు. మానవశరీరంపై సుదూర విశ్వం ఎలా పనిచేస్తుందని అంచనా వేస్తారు. కొత్త టెక్నాలజీలను పరీక్షిస్తారు. రేడియేషన్ ప్రభావం, అంతరిక్ష నౌక పనితీరును అంచనా వేస్తారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!