Site icon NTV Telugu

Epstein Files: ట్రంప్‌పై “ఎప్‌స్టీన్ ఫైల్స్” పోస్ట్ డిలీట్ చేసిన మస్క్.. అసలేంటీ ఈ ‘‘సె*క్స్ స్కాండల్’’..

Epstein Files

Epstein Files

Epstein Files: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల తలెత్తిన విభేదాలు సంచలనంగా మారాయి. వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చని ‘‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’’పై ట్రంప్ తన అసంతృప్తిని తీవ్రస్థాయిలో వ్యక్తం చేశాడు. ఎలాన్ మస్క్ ఒకానొక దశలో ట్రంప్‌ని దించేసి జేడీ వాన్స్‌‌ని అధ్యక్షుడిని చేయాలంటూ కోరడం సంచలనంగా మారింది. దీంతో, ట్రంప్ టెస్లాకు ఇస్తున్న రాయితీలను తీసేస్తానని ప్రకటించడంతో ఇద్దరి మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంది.

ఇదిలా ఉంటే, అమెరికా రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసి ‘‘ఎప్‌స్టీన్ ఫైల్స్’’లో ట్రంప్ ఉన్నాడంటూ మస్క్ సంచలన పోస్ట్ చేశాడు. అయితే, ఇప్పుడు ఆయన చేసిన పోస్టుని తొలగించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ అమెరికాలో లైంగిక నేరస్తుడు, ఆయన చేసిన అక్రమ కార్యకలాపాల్లో అమెరికా పెద్ద తలకాయల ప్రమేయం ఉందనే ఆరోపణ ఉంది. అయితే, ట్రంప్ పేరు కూడా ఈ ఫైల్స్‌లో ఉందనే ఆ ఫైల్స్‌ని ఎప్పుడూ బహిరంగపరచలేదని మస్క్ ఆరోపించాడు. అయితే, ఇప్పుడు ఆ పోస్టును ట్రంప్ డిలీట్ చేశారు.

READ ALSO: Russia: ట్రంప్‌తో వైరం, ఎలాన్ మస్క్‌కి రష్యా ఆఫర్..

అసలేమిటీ ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్?

జెఫ్రీ ఎప్‌స్టీన్ హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం అమెరికా రాజకీయాల్లో ఒక సంచలనం. ఈ సెక్స్ స్కాండల్‌లో మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. మైనర్ బాలికలతో వ్యభిచారం నడుపుతూ, వారిని అమెరికాలోని ప్రముఖుల పక్కలోకి చేర్చారనేది ఈ ఎప్‌స్ట్రీన్‌పై ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో జెఫ్రీ ఎప్‌స్టీన్ అతని భాగస్వామి ఘిస్లైన్ మాక్స్‌వెల్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2002-2005 మధ్య జరిగిన ఈ సెక్స్ కుంభకోణంలో అనేక మంది యువతులకు డబ్బును ఎరగా వేసి జెఫ్రీ లైంగిక దాడులు చేయడమే కాకుండా, అనేక మంది అమెరికా పెద్దమనుషులకు అమ్మాయిలను సఫ్లై చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితులో ఒకరైన వర్జీనియా గియుఫ్రే 2015లో సివిల్ దావా వేయడంతో ఈ పత్రాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కేసులో జూలై 2019లో ఎప్‌స్టీన్‌ని సెక్స్ ట్రాఫికింగ్ అభియోగాల కింద అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విడుదలయ్యారు. అయితే అతను విచారణకు రాకముందే మాన్‌హాటన్ జైలు గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో మాక్స్‌వెల్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తుంది. ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అమెరికా రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల పేర్లు ఉండటంతోనే ఈ పత్రాలను బహిర్గతం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

Exit mobile version