Working Populations: ఇండియాలో యువత ఎక్కువ మంది ఉన్నారు. యువత ఎక్కువ మంది ఉన్న భారత దేశంలో పనిచేసే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. దేశంలో పనిచేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఈ సంఖ్య 2030 నాటికి ప్రపంచ దేశాల్లో ఇండియా టాప్-3లో నిలవనుంది. 2030 నాటికి జనాభాలో పని చేసే సత్తువగల వయసులో ఉన్నవారు అధికంగా ఉండే మూడు దేశాల్లో ఇండియా ఒకటి కాబోతోంది. ప్రపంచంలో ఈ వయస్కులు అత్యధికంగా ఉండే ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల దేశాల్లో భారత దేశం, చైనా, ఇండోనేషియా ఉంటాయి. ఈ మూడు దేశాలు జీ20లో కూడా ఉన్నాయి. దీనిని బట్టి ఎకనమిక్ జాగ్రఫీ తూర్పు దేశాలవైపు మారబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ వివరాలను మెకిన్సే తన ‘‘డ్రైవింగ్ సుస్టెయినబుల్ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్ ఇన్ జీ20 ఎకానమీస్’’ నివేదికలో ప్రకటించింది. శనివారం విడుదలైన ఈ నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం, డిజిటల్, డేటా ప్రసారం వల్ల కమ్యూనికేషన్, విజ్ఞానం పరస్పర మార్పిడి జరుగుతుందని.. దీని మూలంగా గతం కన్నా మరింత ఎక్కువగా ప్రపంచం ఒకరిపై మరొకరు ఆధారపడే విధంగా రూపొందుతుందని తెలిపింది. ప్రపంచం నవ శకం అంచున, మేలి మలుపు అంచున ఉన్నట్లు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు సూచిస్తున్నాయని ప్రకటించింది.
Read Also: Steel Bridge: స్టీల్ బ్రిడ్జి మూసివేత.. పోకిరీల వికృత చేష్టలే కారణమా?
ప్రస్తుతం జీ20 దేశాల్లో సుస్థిరత, సమ్మిళిత, విస్తృతమైన, విభిన్నమైన ధోరణులు కనిపిస్తున్నాయి.. కానీ భవిష్యత్తులో ఆర్థిక కేంద్రాలు మారే అవకాశం ఉంటుంది. జీ20 దేశాల్లో ఆర్థిక సాధికారత రేఖ(దారిద్ర్య రేఖ)కు దిగువన 2.6 బిలియన్ల మంది ఉన్నారు. ప్రపంచంలో 4.7 బిలియన్ల మంది ఉండగా.. భారత దేశంలో 1.07 బిలియన్ల మంది ఈ రేఖకు దిగువన ఉన్నవారు ఉన్నారు. ప్రపంచ జనాభాలో సుమారు సగానికిపైగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే ఉన్నారు. ఆర్థిక వ్యత్యాసాలను తొలగించాలంటే జీ20 దేశాలు అదనంగా 21 ట్రిలియన్ డాలర్లను 2021-2030 దశకంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొంది. భారత దేశం ఈ వ్యత్యాసాన్ని తొలగించడం కోసం ఈ దశాబ్దంలో 5.4 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయాలి.. అంటే దేశ జీడీపీలో 13 శాతం ఖర్చు చేయాలి. ఇక చైనా విషయానికి వస్తే 4.8 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఎనిమిది చర్యలు ప్రజలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతున్నాయి. వాటిల్లో సమ్మిళితత్వం కోసం జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, ఆధార్, మొబైల్‌లను ఉపయోగించుకోవడం, అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం, కోవిన్ పోర్టల్, ప్రభుత్వం అమలు చేస్తున్న చిరు ధాన్యాలపై అవగాహన పథకం ఇటువంటివి ఉపయోగపడనున్నట్టు నివేదికలో పేర్కొంది.