Steel Bridge: స్టీల్ బ్రిడ్జి మూసివేత.. పోకిరీల వికృత చేష్టలే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steel Bridge: ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2.25 కి.మీ నాలుగు లైన్ల స్టీల్ బ్రిడ్జిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు రూ.450 కోట్లు వెచ్చించారు. VST జంక్షన్, RTC క్రాస్ రోడ్స్ మరియు ఇందిరా పార్క్ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి దీనిని నిర్మించారు. సికింద్రాబాద్, తార్నాక, ఓయూ, చర్లపల్లి, అంబర్‌పేట, రామాంతపూర్, ఉప్పల్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే వారికి కూడా ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుంది. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీకి వెళ్లేందుకు గతంలో 35 నిమిషాలకు పైగా సమయం పట్టేది.. స్టీల్ బ్రిడ్జి రావడంతో కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే గమ్యం చేరుతుంది. అయితే ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జితో కొత్త కష్టాలు తలెత్తాయి. ఈ స్టీల్ బ్రిడ్జి పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది. దీంతో రాత్రి పూట పోకిరీలు రెచ్చిపోతున్నారు. హాస్టల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ యువతులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.
Read also: Warangal: ఫుల్ బాటిల్ కావాలి.. తల్వార్‌లతో మందుబాబు హల్ చల్
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ఇటీవల ఇద్దరు మైనర్ యువకులు బ్రిడ్జిపై ఫుల్ గా మద్యం తాగారు. మద్యం మత్తులో హాస్టల్ మెట్లు దిగి వస్తున్న ఓ యువతిపై బీరు బాటిల్ విసిరారు. బాలిక తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. హాస్టల్ పరిసరాల్లోని సీసీ కెమెరాలో పోకిరీల చేష్టలకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనతో హాస్టల్‌లో ఉంటున్న బాలికలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలపై స్థానికులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోకిరీలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రిపూట వంతెనపై రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు. స్టీల్ బ్రిడ్జిపై ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నగర ప్రజల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించింది. వంతెన నిర్మాణానికి దాదాపు 20 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను వినియోగించారు. దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన ఉక్కు వంతెన ఇదే. ఎలాంటి నిర్మాణాలు కూల్చివేయకుండా.. భూసేకరణ లేకుండా ఈ వంతెనను నిర్మించారు. మరో విశేషమేమిటంటే మెట్రో రైలు మార్గానికి ఎగువన నిర్మించిన తొలి ఫ్లైఓవర్ ఇదే.
Health Tips: నిద్రలో మాట్లాడుతున్నారా? ఐతే పెద్ద సమస్యకే దారి తీయవచ్చు
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!