Monkeypox: మంకీపాక్స్ కలవరం.. 11 దేశాల్లో కేసులు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా మంకీపాక్స్ వైరస్ కలవరం రేపుతోంది. ఇన్నాళ్లు కరోనాతో సతమతం అయిన ప్రపంచం ముందు మంకీపాక్స్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ వ్యాధి నెమ్మనెమ్మదిగా ఇతర దేశాల్లో కూడా బయటపడుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కలవరం మొదలైంది. ఇప్పటికే కరోనా వ్యాధి పూర్తి స్థాయిలో సద్దుమణగక ముందే మంకీపాక్స్ రూపంలో మరో వ్యాధి విస్తరిస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి.
పెరుగుతున్న మంకీపాక్స్ వ్యాధి వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూఎచ్ఓ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ వ్యాధి విస్తరణపై చర్చించింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఇప్పటివరకు ప్రపంచంలో 11 దేశాల్లో మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. మొత్తంగా ఇప్పటి వరకు 80 కేసులను ధ్రువీకరించగా… మరో 50 కేసులు పరిశీలనలో ఉన్నాయి.
Also Read
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్‌పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్‌తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
యూకే, యూఎస్, పోర్చుగల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బెల్జియం, స్వీడన్, స్పెయిన్, ఆస్ట్రేలియా దేశాల్లో మంకీపాక్స్ వ్యాధిని గుర్తించారు. స్మాల్ పాక్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలే మంకీపాక్స్ లో కనిపిస్తుంటాయి. ఒళ్లంతా దద్దుర్లు రావడంతో పాటు లింప్ నోడ్స్ వాయడం, ఫ్లూ వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అయితే 2-4 వారాల్లో వ్యాధి దానికదే తగ్గిపోతుంది. చాలా వరకు సీరియస్ పరిస్థితులు రావని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే మంకీ పాక్స్ పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. మంకీపాక్స్ వ్యాప్తి కారణంగా అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఐసీఎంఆర్ కి ఆదేశాలు జారీ చేసింది. విదేశాలలో మంకీపాక్స్ పరిస్థితిని నిశితంగా గమనించాలని… ప్రభావిత దేశాల వచ్చే అనారోగ్యంతో ఉన్న ప్రయాణీకులను వేరుచేసి, వారి నమూనాలను పరీక్షల కోసం నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణేకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్‌కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!